EPFO New Rule announced for employees PF deduction
EPFO New Rule: ఉద్యోగులకు కీలకమైన కొత్త నిబంధనలను ఈపీఎఫ్ఓ అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త ఈపీఎఫ్ఓ పథకం 2026 ప్రకారం, ఇప్పటి వరకు అమలులో ఉన్న 12 శాతం PF కటింగ్ ని తప్పనిసరి కాదు. వాస్తవానికి, నిన్న మొన్నటి వరకు ఎంప్లాయిస్ అందరూ కూడా బేసిక్ శాలరీ నుంచి 12% అమౌంట్ ని కచ్చితంగా PF అకౌంట్ లో జమ చేయాల్సి వస్తుంది. అయితే, ప్రభుత్వం కొత్త రూల్స్ తో ఇది తప్పనిసరి కాదు. అంతేకాదు, ఒక మినిమం అమౌంట్ ను ప్రభుత్వం సూచించింది. ఈ కొత్త రూల్ మరియు ఈ రూల్ తో ఎంప్లాయిస్ కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి.
పైన తెలిపిన విధంగా ఇక నుంచి పీఎఫ్ కోసం కచ్చితంగా 12% చెల్లించాలని రూల్ లేదు. ఒకవేళ ఎంప్లాయీస్ కోరుకునే 12% చెల్లించవచ్చు. లేదనుకుంటే కేవలం రూ. 1,800 రూపాయల మినిమం అమౌంట్ మాత్రమే చెల్లించే అవకాశం అందించింది. దీనికోసం ఎంప్లాయిస్ వారి నిర్ణయాన్ని కంపెనీ అనుమతి ద్వారా ఆన్లైన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఎలా అంటే, ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ వేతన పరిమితి రూ.15,000 ఆధారంగా ఆధారంగా లెక్కించే రూ.1,800 వరకు మాత్రమే ఉంటుంది. ఇది మినిమమ్ బేసిక్ సాలరీ గా ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఈ మినిమమ్ అమౌంట్ కంటే ఎక్కువ మొత్తాన్ని PF లో జమ చేయాలనుకుంటే అది స్వచ్ఛంద (Voluntary) చందా గా పరిగణిస్తారు.
అయితే, ఎంప్లాయిస్ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, 12% EPF కాంట్రిబ్యూషన్ రేటులో ఎలాంటి మార్పు లేదని మీరు గ్రహించాలి. మారింది ఏమిటంటే, రూ. 1,800 మినిమమ్ కంట్రిబ్యూషన్ లేదా 12% లో మీకు నచ్చిన అమౌంట్ చెల్లింపు మీరు తప్పనిసరిగా స్పష్టత ఇవ్వాలి. రూ.15,000 వేతన పరిమితి వరకు మాత్రమే తప్పనిసరి కంట్రిబ్యూషన్ వర్తిస్తుంది. దానికంటే ఎక్కువగా అమౌంట్ (12%) PF లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది ఉద్యోగుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
ఈ కొత్త అప్డేట్ మరియు రూల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఎక్కువ PF డిడక్షన్ అయ్యే ఎంప్లాయిస్ ఈ అమౌంట్ ను రూ. 1,800 రూపాయలకు సెట్ చేసుకుంటే సాలరీ లో ఎక్కువ మొత్తాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. అదే, 12% అమౌంట్ ను పీఎఫ్ లో జమ చేస్తే ఎక్కువ మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో అందుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ ఛాయస్ ని ఎంప్లాయిస్ చేతికి అందించింది.
Also Read: Prime Day Big Deal: లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!
కొత్త EPF స్కీమ్ లో మరో కీలక మార్పు చేసింది. అదేమిటంటే, PF విత్ డ్రా ప్రక్రియను కూడా సరళీకరించింది. గతంలో ఉన్న అనేక విత్ డ్రా కేటగిరీలను తగ్గించి, క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభంగా మార్చే చర్యలు తీసుకున్నారు. అలాగే, డిజిటల్ సేవలకు ప్రాధాన్యత పెంచుతూ, భవిష్యత్తులో UPI ఆధారిత విత్‌డ్రా మరియు WhatsApp వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా కొన్ని EPFO సేవలను అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రణాళికలు ఉన్నట్లు చెబుతున్నారు.