Prime Day Big Deal: లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!
అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుంది
లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది
ఈ సౌండ్ బార్ రియర్ స్పీకర్ లను సెట్ చేసుకోవడానికి వీలుగా రియర్ స్పీకర్ స్టాండ్ తో వస్తుంది
Prime Day Big Deal: అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ సేల్ ప్రారంభం కావడానికి అంటే ముందే లేటెస్ట్ ఫ్లోర్ స్టాండ్ 5.1 Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది గత నెలలో విడుదలైన లేటెస్ట్ పవర్ ఫుల్ సౌండ్ బార్ మరియు కంప్లీట్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ రియర్ స్పీకర్ లను సెట్ చేసుకోవడానికి వీలుగా రియర్ స్పీకర్ స్టాండ్ తో వస్తుంది.
SurveyPrime Day Big Deal: 5.1 Dolby Soundbar
సాధారణ సౌండ్ బార్స్ మాత్రమే మార్కెట్ లో అందుబాటులో ఉండగా 5.1 ఛానల్ సౌండ్ బార్ ను సరైన సెటప్ కోసం ఫ్లోర్ స్టాండ్ తో జెబ్రోనిక్స్ కొత్తగా Juke BAR 9535 ఫ్లోర్ స్టాండ్ సౌండ్ బార్ ను లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ను గత నెల రూ. 13,999 రూపాయల ధరతో ఇండియాలో విడుదల చేసింది.

అయితే, ఈ సౌండ్ బార్ ని ఈరోజు ప్రైమ్ డే అర్లీ డీల్ లో భాగంగా రూ. 2,000 డిస్కౌంట్ అందించి రూ. 11,999 ప్రైస్ తో అమెజాన్ సేల్ చేస్తోంది. అంతేకాదు, Canara Bank క్రెడిట్ కార్డు తో ఈ సౌండ్ బార్ కొనే వారికి రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా ఈ సౌండ్ బార్ పై అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 10,999 ధరలో ఈరోజు అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ను ఆఫర్ ధరలో కొనాలనుకుంటే Buy From Here లింక్ పై క్లిక్ చేయండి.
Also Read: Prime Day Mega Deal: లేటెస్ట్ శాంసంగ్ ప్రీమియం బడ్స్ ని కేవలం రూ. 2999 ధరకే అందుకోండి.!
Zebronics 5.1 Dolby Soundbar: ఫీచర్స్
ఇది జెబ్రోనిక్స్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఒక శక్తివంతమైన 5.1 ఛానల్ సౌండ్ బార్. ఇది 525W అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది. ఇందులో Dolby Audio సపోర్ట్ ఉండటంతో సినిమాలు, వెబ్ సిరీస్, మ్యూజిక్ మరియు గేమింగ్ సమయంలో మీరు మీ స్మార్ట్ టీవీ తో జతచేసి స్పష్టమైన మరియు డైనమిక్ సౌండ్ ను ఆస్వాదించవచ్చు.
ఈ సౌండ్ బార్ లో సెటప్ లో 3 హై పర్ఫార్మెన్స్ స్పీకర్లు కలిగిన బార్, 6.5 ఇంచ్ సబ్ వూఫర్ మరియు ఫ్లోర్ స్టాండ్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సెటప్ తో డీప్ బాస్ తో పాటు అన్ని దిశల నుంచి సౌండ్ వచ్చే 5.1 సరౌండ్ సౌండ్ అనుభూతి లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఇందులో HDMI ARC, ఆప్టికల్ ఇన్ పుట్, బ్లూటూత్ 5.0, USB మరియు AUX వంటి అనేక ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్ తో వచ్చే రిమోట్ కంట్రోల్ తో ఈక్వలైజర్ మోడ్, వాల్యూమ్ మరియు బాస్ వంటి సెట్టింగ్ లను సులభంగా మార్చుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
