Oppo Reno 16 launched in india and know the price and features
ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ ఒప్పో ఈరోజు భారత్ లో Oppo Reno 16 మరియు Reno16c రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. వీటిలో ఒప్పో రెనో 16 స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఒప్పో ఈ ఫోన్ ను సరికొత్త 3D పాప్ డిజైన్ మరియు పవర్ ఫుల్ కెమెరా తో అందించింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
ఒప్పో ఈ కొత్త ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రైస్ వివరాలు ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోన్ స్టారీ వైట్ మరియు ట్విలైట్ వయొలెట్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ముందస్తు బుకింగ్స్ ను కూడా ఒప్పో ప్రారంభించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పై అనేక Pre-Order బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేసింది.
ఈ ఫోన్ ను ముందుగా బుక్ చేసే యూజర్ల కోసం ప్రత్యేమైన బెనిఫిట్స్ జత చేసింది. ఈ ఫోన్ పై 10% భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు ఎక్స్ చేంజ్ పై రూ. 5000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా జత చేసింది. ఇవి కాకుండా అమెజాన్ ఎకో పాప్ పై రూ. 1,000 డిస్కౌంట్ అందించింది మరియు ఎన్ కో బడ్స్ 3 ప్రో ప్లస్ బడ్స్ ను కూడా కేవలం రూ. 1,499 ధరలో అందుకోవచ్చు. ఇది కాకుండా రూ. 1,000 స్టూడెంట్ డిస్కౌంట్ మరియు 180 డేస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తోంది.
Also Read: Prime Day 2026 ఎర్లీ బర్డ్ బిగ్ డీల్: సగం ధరకే Nothing Phone 3 సేల్ చేస్తున్న అమెజాన్.!
ఒప్పో ఈ కొత్త ఫోన్ ను ప్రీమియం మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గా అందించింది. ఈ ఫోన్ ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన చిప్ సెట్ మరియు AI ఆధారిత కెమెరా ఫీచర్లతో వచ్చింది. ఈ ఫోన్ 6.59 అంగుళాల AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మరియు 1,800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్క్రీన్ క్రిస్టల్ గార్డ్ గ్లాస్ రక్షణతో వస్తుంది.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon Dimensity 8350 ప్రాసెసర్ జతగా 12GB LPDDR5X ర్యామ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందించే శక్తిని కలిగి వుంది. ఈ ఫోన్ 256GB UFS 3.1 ఫాస్ట్ రెస్పాన్స్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఒప్పో లేటెస్ట్ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టం ఆధారితమైన ColorOS 16 పై పని చేస్తుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP OIS మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 50MP టెలిఫోటో కెమెరా (3.5x ఆప్టికల్ జూమ్) కెమెరాలు ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఈ ఫోన్ లో అందించింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, రాత్రి సమయంలో కూడా అద్భుతమైన ఫోటోలు అందించే నైట్ మోడ్, AI Portrait, AI Editor, Ai Remix Collage వంటి ఆధునిక Ai కెమెరా ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 6,700mAh భారీ బ్యాటరీ మరియు 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ఏరోస్పెస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు సరికొత్త హోలో వర్స్ 3D డిజైన్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇండస్ట్రీ లీడింగ్ IP69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడ కలిగి ఉంటుంది.