EPFO 3.0 New Rules: ఉద్యోగులకు మారనున్న కొత్త PF సేవలు ఇవే.!

HIGHLIGHTS

EPFO తన సేవలను చాలా వేగంగా డిజిటలైజేషన్ చేయడానికి పూనుకుంది

ఈ ప్రక్రియ కోసమే కొత్తగా EPFO 3.0 అనే కొత్త సంస్కరణను తీసుకురానుంది

ఎంప్లాయీస్ తమ PF గురించి సరైన ఇన్ఫర్మేషన్ కలిగి ఉండటం చాలా అవసరం

EPFO 3.0 New Rules: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సేవలను చాలా వేగంగా డిజిటలైజేషన్ చేయడానికి పూనుకుంది. ఈ ప్రక్రియ కోసమే కొత్తగా EPFO 3.0 అనే కొత్త సంస్కరణను తీసుకురానుంది. అయితే, ఇప్పటికే చాలా కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అనేక అంశాలు ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. అందుకే, అధికారికంగా ప్రకటించిన మరియు ప్రధాన మీడియా నివేదికల్లో వెల్లడైన సరైన వివరాలు తెలుసుకోవడం అందరికీ మంచిది. ముఖ్యంగా, ఎంప్లాయీస్ తమ PF గురించి సరైన ఇన్ఫర్మేషన్ కలిగి ఉండటం చాలా అవసరం.

EPFO 3.0 New Rules: ఏమిటి ఇది?

PF సేవలను కోర్ బ్యాంకింగ్ సిస్టం తరహాలో మార్చడం EPFO 3.0 లో ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. దీని వల్ల PF సభ్యులు దేశంలోని ఏ EPFO కార్యాలయం నుండైనా తమ ఖాతాకు సంబంధించిన సేవలు పొందగలుగుతారు. కొత్త పోర్టల్ లో మెరుగైన బ్యాక్‌ఎండ్ సాఫ్ట్‌ వేర్, AI ఆధారిత భాషా సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈపీఎఫ్ఓ 3.0 లో ప్రధాన మార్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్

ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ సిస్టం ను మరింత విస్తరించి, క్లెయిమ్‌ ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడం పై ఈపీఎఫ్ఓ దృష్టి పెట్టింది. దాదాపు 5 లక్షల వరకు కొన్ని క్లెయిమ్స్ ఆటో ప్రాసెసింగ్ కింద పరిష్కరించబడుతున్నాయి.

UPI ద్వారా PF విత్‌ డ్రా

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫీచర్ అన్నింటి కన్నా ముఖ్యమైనది మరియు అందరూ ఎదురు చూస్తున్న ఫీచర్ అని చెప్పవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు భవిష్యత్తులో UPI ద్వారా PF మొత్తాన్ని వేగంగా విత్‌ డ్రా చేసుకునే సదుపాయం పొందే అవకాశం ఉంది. అయితే, ఈ సౌకర్యం దశలవారీగా అమలు చేయనున్నారు.

సులభమైన PF ట్రాన్స్‌ఫర్

గతంలో ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు కొత్త పిఎఫ్ అకౌంట్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా PF ఖాతా బదిలీ ప్రక్రియను మరింత సరళమైన విధంగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.

Also Read: సాధారణ 55 ఇంచ్ LED టీవీ రేటుకే 4K Mini LED Smart Tv అందుకోండి.!

AI ఆధారిత సేవలు

సేవలు మరింత వేగంగా మరియు అందరికీ చేరువగా ఉండే అవకాశం ఇప్పుడు AI అందిస్తోంది. అందుకే ఏఐ ఉపయోగించి వివిధ భారతీయ భాషల్లో సేవలు అందించేందుకు AI ఆధారిత అనువాద సాధనాలను ఈపీఎఫ్ఓ అభివృద్ధి చేస్తోంది. కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ పెన్షనర్ల కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టం (CPPS) అమలును విస్తరిస్తోంది. దీని ద్వారా పెన్షన్ సేవలు మరింత సులభం కానున్నాయి.

ఇవన్నీ కూడా అమలు కావడానికి సిద్ధంగా ఉన్న కొత్త సర్వీసులు అని మనం చెప్పవచ్చు. అయితే, మీరు గమనించవలసిన ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, ATM ద్వారా PF విత్‌ డ్రా, UPI ఆధారిత తక్షణ ఉపసంహరణ వంటి కొన్ని ఫీచర్లు విస్తృతంగా వార్తల్లో వచ్చినప్పటికీ, అవన్నీ సభ్యులు అందరికీ పూర్తిగా అమల్లోకి వచ్చాయని EPFO ఇంకా ప్రకటించలేదు. చాలా మార్పులు దశలవారీగా అమలు అవుతున్నాయి. అందువల్ల సభ్యులు అధికారిక EPFO ప్రకటనలు మాత్రమే నమ్మడం మంచిది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :