మీరు ప్రయాణిస్తున్న లేదా మరేదైనా ట్రైన్ లైవ్ రన్నింగ్ స్టేటస్ ను Google Maps చెక్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్ కేవలం రోడ్ లను మాత్రమే కాదు, రైళ్లు మరియు విమాన యానానికి కూడా ట్రావెల్ మోడ్ లను కూడా కలిగి ఉంటుంది. వీటి ద్వారా మీ లొకేషన్ నుండి మీరు చేరాల్సిన గమ్యస్థానానికి రూట్ మ్యాప్ లను పొందవచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న రైలు పేరు, బోర్డింగ్ స్టేషన్ మరియు మార్గంలో వచ్చే ఇతర స్టాప్‌లను కూడా గూగుల్ మ్యాప్ లో చూడవచ్చు. అంతేకాదు, మీ ప్రయాణానికి పట్టే సమయం మరియు Live Train రన్నింగ్ స్టేటస్ ను కూడా గూగుల్ మ్యాప్ అందిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
పైన తెలిపిన అన్ని వివరాలను మీరు పొందాలంటే ముందుగా మీరు మీ ఫోన్ లో గూగుల్ మ్యాప్ యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ను కలిగిఉండాలి. ఈ ఫీచర్ iOS మరియు Android రెండు OS ల కోసం అందుబాటులో వుంది.