మీరు ఇప్పటి వరకూ ఎన్ని SIM కార్డ్స్ తీసుకున్నారో మీకు తెలుసా.!

మీరు ఇప్పటి వరకూ ఎన్ని SIM కార్డ్స్ తీసుకున్నారో మీకు తెలుసా.!
HIGHLIGHTS

మీరు తీసుకున్న SIM కార్డు వివరాలు తెలుసుకోవచ్చు

మొబైల్ నంబర్ వివరాలను మరియు వాటి యాక్టివ్ స్టేటస్ చూడవచ్చు

మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు

మీరు ఇప్పటి వరకూ ఎన్ని SIM కార్డ్స్ తీసుకున్నారో మీకు తెలుసా? లేదా మీరు ఇప్పటి వరకూ ఎన్ని మొబైల్ నంబర్ లు తీసుకున్నారు, అందులో ఎన్ని ఇంకా యాక్టివ్ గా ఉన్నాయో తెలుసుకోవాలని మీకెప్పుడైనా అనిపించిందా. ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తున్నట్లయితే ఈ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. వినియోగదారులు తీసుకున్న అన్ని మొబైల్ నంబర్ వివరాలను మరియు వాటి యాక్టివ్ స్టేటస్ ను పారదర్శకంగా ఉంచడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DoT) ఇటీవల ఒక కొత్త వెబ్సైట్ తీసుకొచ్చింది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు తీసుకున్న మొబైల్ నంబర్ల కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవచ్చు. 

మీ మొబైల్ ఫోన్ బ్రౌజర్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో tafcop.dgtelecom.gov.in వెబ్ సైట్ ని తెరవండి. తరువాత, సూచించిన వద్ద మీ మొబైల్ నంబర్‌ నమోదు చేయండి. క్రింద OTP రిక్వెస్ట్ కోసం  సూచించిన బాక్స్ పైన నొక్కండి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి తనిఖీ చేయండి.

OTP ని ధృవీకరించిన తరువాత, మీ పేరులో పనిచేసే అన్ని మొబైల్ నంబర్స్ యొక్క పూర్తి జాబితాను మీరు అందుకుంటారు. వాటిలో, మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏదైనా నంబర్ గురించి రిపోర్ట్ చెయవచ్చు. తరువాత, మీరు కోరుకున్న నంబర్ మాత్రమే వాడుకలో ఉంటుంది మరియు మీరు ఫిర్యాదు చేసిన నంబర్లను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo