ఇలా కూడా దోచేస్తారా..Whatsapp నయా స్కామ్ తో జాగ్రత్త ..!

ఇలా కూడా దోచేస్తారా..Whatsapp నయా స్కామ్ తో జాగ్రత్త ..!
HIGHLIGHTS

సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నీక్ తో మోసాలకు తెరలేపుతున్నారు

నయా వాట్స్అప్ స్కామ్ మరింత ఆలోచింప చేసేలా చేస్తోంది

చిన్న వీడియో కాల్ తో మీ నుండి డబ్బును గుంజే కొత్త పంధాని మొదలుపెట్టారు

స్నేహితులు మరియు సన్నిహితులతో పాటుగా సంప్రదించాడనికి మరియు తెలిసిన మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఆధారపడేది వాట్స్అప్ అని మనకు తెలుసు. అందుకే, సైబర్ నేరగాళ్లు వాట్స్అప్ ని ఎక్కువ టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే, సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నీక్ తో మోసాలకు తెరలేపుతున్నారు.

ముఖ్యంగా, ఇటీవల కొత్తగా బయటపడిన నయా వాట్స్అప్ స్కామ్ మరింత ఆలోచింప చేసేలా చేస్తోంది. వాట్స్అప్ లో కేవలం చిన్న వీడియో కాల్ తో మీ నుండి డబ్బును గుంజే కొత్త పంధాని మొదలుపెట్టారు.          

మీ వాట్స్అప్ నంబర్ కు తెలియని నంబర్ నుండి అనుకోకుండా వీడియో కాల్ వచ్చిందో జర భద్రం. ఎందుకంటే, ఆ నంబర్ తో వచ్చిన వీడియో కాలింగ్ లో ఒక న్యూడ్ గర్ల్ కనిపిస్తుంది మరియు కొంత సేపటికే ఆ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. అంతే, ఇక అక్కడి నుండే మొదలవుతుంది అసలు కథ. మీరు కాల్ లిఫ్ట్ చేసిన తరువాత మీకు వచ్చిన ఆ వీడియో కాల్ యొక్క స్క్రీన్ షాట్స్ తీసుకోబడతాయి.

వాటిని మీకు పంపింపించి మీ నుండి డబ్బును గుంజే ప్రయత్నం చేస్తారు. ఇదొక్కడే కాదు, అనుకుకోకుండా మా ఫ్రెండ్ నంబర్ కు బదులుగా మీ నంబర్ కు OTP నంబర్ పంపించామని తిరిగి మెసేజ్ చెయ్యమని కూడా మోసం చేసే స్కామ్ కూడా వాడుకలో ఉంది. ఇలా సైబర్ నేరగాళ్లు పలువిధాలుగా తమ అతితెలివి తేటలను ఉపయోగిస్తున్నారు. కాబట్టి, మీకు కొత్త నంబర్ నుండి వచ్చే వాట్స్అప్ కాల్స్ మరియు వీడియో కాలింగ్ వంటి వాటితో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది.        

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo