ఆధార్ మోసాలతో జాగ్రత్త… ఇలాంటి పనులు చెయ్యొద్దు..!
ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని UIDAI హెచ్చరిస్తోంది
జాగ్రత్తగా లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తుంది
ఇలా మీ ఆధార్ విషయంలో చెయ్యవద్దు
ప్రజలు తమ ఆధార్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని UIDAI పదే పదే హెచ్చరిస్తోంది. ఎందుకంటే, ఆధార్ మోసాలు పెరుగుతున్న క్రమంలో ఆధార్ కార్డ్ ఉన్న ప్రతిఒక్కరి కోసం UIDAI అనేక అలర్ట్స్ జారీ చేసింది. ప్రతి విషయాన్ని షోషల్ మీడియాలో పెట్టెయ్యడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. ఇలా మీ ఆధార్ విషయంలో చెయ్యవద్దని మరియు ఆధార్ కు సంబంధించిన వివరాలను షోషల్ మీడియాలో షేర్ చెయ్యడం చాలా ప్రమాదమని ముందుగా UIDAI హెచ్చరించింది. ఆధార్ వినియోగదారులను ఎటువంటి సమాచారాన్ని కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లోనూ షేర్ చేయవద్దని కూడా ప్రజలను UIDAI హెచ్చరించింది.
Surveyమనం దేశంలో అత్యంత ప్రధానమైన ఈ అధికారిక పత్రాన్ని గురించి జాగ్రత్తగా లేకుంటే భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తుంది. కాబట్టి, మీ ఆధార్ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
అలాగే, UIDAI కొత్త సంవత్సరంలో ఆధార్ కార్డ్ పైన కొత్త విధానం ప్రవేశపెట్టింది. అదే, PVC Aadhaar Card. ముందుగా, అందరికి అందించిన ఆధార్ కార్డ్ కేవలం ప్రింటెడ్ పేపర్ మాత్రమే. అందుకోసమే, ఈ PVC Aadhaar Card విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ATM కార్డ్ మాదిరిగా ఉంటుంది మరియు ఎక్కడైనా తీసుకెళ్లడానికి వీలుగా మీ జేబులో లేదా వాలెట్ లో సరిపోతుంది. ఈ PVC Aadhaar Card కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కేవలం రూ. 50 చెల్లిస్తే సరిపోతుంది.
PVC ఆధార్ కార్డు కోసం ఎలా అప్లై చెయ్యాలి?
PVC ఆధార్ కార్డు కోసం అప్లై చెయ్యడం చాలా సులభం. దీనికోసం, UIDAI పోర్టల్ కి వెళ్లి My Aadhaar ట్యాబ్ నుండి మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ తో PVC ఆధార్ కార్డు కోసం అప్లై చెయ్యవచ్చు.
1. https://uidai.gov.in/ వెబ్సైట్ కి వెళ్ళండి
2. MyAadhaar ట్యాబ్ పైన నొక్కండి
3. ఆర్డర్ ఆధార్ PVC కార్డ్ పైన నొక్కండి
4. ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది
5. ఇక్కడ మీ ఆధార్ నంబర్/వర్చువల్ ID/ EID తో లాగిన్ అవ్వండి
6. OTP మీ రిజిస్టర్ నంబర్ కు వస్తుంది.
ఈ విధంగా కేవలం రూ. 50 చెల్లించి మీ రిజిష్టర్ మొబైల్ ద్వారా మీ ఇంటి వద్దకే ATM కార్డ్ వంటి ఆధార్ PVC కార్డు ను తెప్పించుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ల్సిన అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి చాలా సింపుల్ గా ఆర్డర్ చేయవచ్చు.