CES 2021 నుండి పాప్ అప్ కెమెరాతో మూడు కొత్త మోనిటర్లను ప్రకటించిన DELL

HIGHLIGHTS

Dell సరికొత్తగా మూడు కొత్త మోనిటర్లను ప్రకటించింది.

Dell కొత్త మోనిటర్లను ప్రత్యేకమైన Microsoft Teams బటన్లతో తీసుకొచ్చింది.

పాప్ అప్ కెమెరా Windows Hello ఫేసియల్ రికగ్నైజేషన్ సపోర్ట్ తో వస్తుంది.

CES 2021 నుండి పాప్ అప్ కెమెరాతో మూడు కొత్త మోనిటర్లను ప్రకటించిన DELL

Dell సరికొత్తగా మూడు కొత్త మోనిటర్లను ప్రకటించింది. CES 2021 నుండి ఈ మూడు కొత్త మోనిటర్లను ప్రకటించింది మరియు వచ్చే నెలలో వీటిని లాంచ్ చేయనుంది. ఈ మోనిటర్లను సాంప్రదాయమైన మోనిటర్ల మాదిరిగా కాకూండా, ప్రత్యేకమైన Microsoft Teams బటన్లతో తీసుకొచ్చింది. అంతేకాదు, ఈ మోనిటర్లు మైక్రో సాఫ్ట్ ధ్రువీకరణ పొంధింన ప్రపంచంలో మొట్టమొదటి సర్టిఫైడ్ వీడియో కాన్ఫరెన్సింగ్ మోనిటర్లు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dell ప్రకటించిన ఈ కొత్త ,మోనిటర్లలో అందించిన డేడికేటెడ్ బటన్లు వీడియో కాల్స్ చేయడానికి మరియు రిసీవ్ చేసుకోవడానికి Teams App ని త్వరగా ఓపెన్ చెయ్యడానికిఅనుమతిస్తుంది. అంతేకాదు, ఇందులో అందించిన ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ ద్వారా వీడియో కాలింగ్ కోసం హ్యాండ్స్ ఫ్రీ అనుభవానికి ఈ మోనిటర్లు మీకు మద్దతిస్తాయి.

ఈ డెల్ మోనిటర్లలో ప్రత్యేకత కేవలం Teams బటన్ మాత్రమే కాదు, ఇందులో అందించిన 5MP పాప్ అప్ కెమెరా కూడా నిలుస్తుంది. ఈ పాప్ అప్ కెమెరా Windows Hello ఫేసియల్ రికగ్నైజేషన్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే, ఈ మోనిటర్లలో నోయిస్ క్యాన్సిలింగ్ మైక్రో ఫోన్ మరియు మంచి సౌండ్ అందించడాని 5W సౌండ్ అందించగల రెండు స్పీకర్లు కూడా వున్నాయి. ఎక్కువ సమయం పనిచేసినా కూడా కళ్ళకు హాని కలించకుండా డిస్ప్లే బ్లూ లైట్ ను తగ్గించే ప్రత్యేకమైన మోడ్ కూడా వుంది.                             

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo