ఇటీవల కాలంలో గూగుల్ కొన్ని ప్రముఖ యాప్స్ ని ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఈ యాప్స్ అన్ని కూడా యూజర్ల యొక్క సున్నితమైన డేటాని సేకరిస్తునట్లుగా గుర్తించడం ద్వారా ఇవి మాల్వేర్ ను కలిగి ఉన్నట్లుగా నిర్ధారించి, ప్లే స్టోర్ నుండి తొలిగించింది. వీటిలో కొన్ని యాప్స్ ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి. మీరు కనుక మీ ఫోన్ లో ఈ యాప్స్ లో ఏదైనా యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉంటే వెంటనే మీ ఫోన్ నుండి డిలీట్ చేయండి. ఈ క్రింద ఆ యాప్స్ లిస్ట్ చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
ముందుగా, 5 యాప్స్ ను గుర్తించి తొలగించిన గూగుల్, తరువాత రీసెంట్ మరొక 4 యాప్స్ లను గుర్తించి తొలగించింది. అయితే, అప్పటికే చాలా మంది ఈ నాలుగు యాప్స్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. అందుకే, మీ ఫోన్ లో ఈ 9 యాప్ లలో ఏవైనా ఉంటే వెంటనే తీసెయ్యండి. తద్వారా, మీ ఫోన్ ను ఈ మాల్వేర్ భారీ నుండి సురక్షితంగా ఉంచవచ్చు.
జోకర్ మాల్వేర్ అనేది మీకు తెలియకుండానే మీ ఫోన్ నుండి ఆన్లైన్ యాడ్స్ మరియు ఆన్లైన్ సర్వీస్ లకు సబ్ స్క్రిప్షన్ ను యాక్సెస్ చేస్తుంది. అంటే, మీకు తెలియకుండానే మీరు తీసుకోని సర్వీస్ లకు మీరు డబ్బు చెల్లిస్తారు. అంటే, ఈ మాల్వేర్ మిమల్ని జోకర్ చేస్తుంది. ఇది ఎంత ప్రమాదకరమైన మాల్వేర్ అంటే, చెల్లింపులను రహస్యంగా ఆమోదించడానికి SMS నుండి OTP లను కూడా యాక్సెస్ చేయగలదు. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను చూసుకునే వరకూ మీకు ఈ విషయం గురించి తెలియదు.