చిప్ కార్డులు ఇస్తామంటూ బ్యాంకు అకౌంట్లలో సొమ్ము ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు!
మీకు చిప్ తో కూడిన డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను ఇస్తామంటూ బ్యాంకులు ఎప్పుడు మీకు ఫోన్ చేయవు.
RBI చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ 2007 యొక్క సెక్షన్ 18 (2) ప్రకారం ఆర్టికల్ 18, 2015 లోని నిబంధనల ప్రకారం, అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు 'Chip' పైన ఆధారపడి ఉండాలని RBI పేర్కొంది. దీనిని EMV డెబిట్ / క్రెడిట్ కార్డు అని పిలుస్తారు. ప్రస్తుతం వాడుతున్న డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ విషయాన్నీ ఎస్ఎమ్ఎస్ ద్వారా జారీ చేస్తున్నారు.
ఇది అపాయాలకు గురికాకుండా, మరింత భద్రత కలిగించే ఏకైక అయస్కాంత స్ట్రైక్-కార్డు మాత్రమే. ప్రతి క్రెడిట్ / డెబిట్ కార్డును డిసెంబర్ 31, 2018 న EMV చిప్ ఆధారిత కార్డులతో భర్తీ చేయాలని, బ్యాంకు ఖాతాదారులకి గత కొన్నిరోజులగా వారి బ్యాంకుల నుండి SMS అందుకుంటున్నారు. EMV ఆధారిత కార్డులతో ఉన్న అయస్కాంత స్ట్రిప్-కార్డులను మార్చడానికి వారికి సలహాలు కూడా అందిచబడ్డాయి .
Surveyకానీ, ఇదే అదునుగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతున్నారు. తాము బ్యాంకు నుండి కాల్ చేస్తున్నామని, మీకు బ్యాంకు యొక్క చిప్ కార్డు ఇవ్వడానికి కొన్ని వివరాలను అందిచాల్సి ఉంటుందని మాయ మాటలు చెప్పి, వారి అకౌంట్లలోని సొమ్మును కొల్లగొడుతున్నారు.
ఇది ఎలా సాధ్యం ?
ఆన్లైన్లో మన అకౌంట్ ఓపెన్ చేయాలన్నలేదా దాని నుండి ఎవరికైనా డబ్బును పంపించాలన్నా కూడా మన బ్యాంక్ యొక్క లాగిన్ ఐడి మరోయు పాస్వర్డ్ కచ్చితంగా అవసరం, కాబట్టి ఇవిలేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం కష్టతరం. కానీ, డెబిట్ కార్డు ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలన్నా, కార్డు క్లోనింగ్ చేయాలన్నా కూడా కార్డు యొక్క పూర్తి వివరాలను కలిగివుంటే సరిపోతుంది. ప్రస్తుతం బ్యాంకులు అనుసరిస్తున్న చిప్ కార్డు నియమాలను ఆసరాగాచేసికొని, సైబర్ నేరగాళ్లు కొంతమంది అకౌంట్ హోల్డర్లకు ఫోన్ చేసి మీకు Chip కలిగిన కొత్త కార్డును ఇవ్వనున్నామని, అందుకు మీ పాత కార్డు మరియు మీ వివరాలు కావాలని వారిద్వారా వివరాలను తెలుసుకొని వారి అకౌంట్ నుండి డబ్బును తీసుకుంటున్నారు.
ఇలా జరగకుండా ఏమి చేయాలి ?
1. వాస్తవానికి, బ్యాంకులు ఎప్పుడు కూడా మీ వివరాలను ఫోను ద్వారా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించవు. ఎందుకంటే, మీకు సంబంధించిన పూర్తి వివరాలు బ్యాంకుల దగ్గర ఉంటాయి. మీకు ఇలాంటి ఫోన్లు వచ్చినపుడు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు.
2. ఒకవేళ, మీకు ఎక్కువగా ఒత్తిడి తెచ్చినట్లయితే, మేము మా దగ్గరలోని బ్రాంచిని సంప్రదిస్తామని ఒక్క మాటలో తేల్చి చెప్పండి.
3. OTP- వన్ టైం పాస్వర్డ్, ఎటువంటి బ్యాంకు కూడా మీ అకౌంటుకు వచ్చేటటువంటి ఈ OTP గురించి ఎప్పుడు కూడా సమాచారాన్ని సేకరించవు. మిమ్మల్ని మీ యొక్క OTP గురించి అడుగుతున్నారంటే, కచ్చితంగా మిమల్ని మోసగిస్తున్నారని అర్ధం చేసుకోండి.
4. మీ అకౌంటుకు సంబంధించిన వివరాలను, మీరు స్వయంగా బ్యాంకును సంప్రదించి తెలుసుకోండి తప్ప, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile