Budget 2025: ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ 2025 ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. కొత్త బడ్జెట్ నుంచి మేక్ ఇన్ ఇండియా సిద్ధాంతాన్ని మరింత బలోపేతం చేసేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కొత్త నిర్ణయాలు స్మార్ట్ ఫోన్ రేట్లు పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే, ఇది పోజిటివ్ మార్గంలోనే కనిపిస్తోంది. ఎందుకంటే, స్మార్ట్ ఫోన్ బ్యాటరీ, స్మార్ట్ LED లు మరియు మరిన్ని ఎలక్ట్రానిక్స్ లో ఉపయోగించే క్రిటికల్ కాంపోనెంట్స్ పై దిగుమతి సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త నిర్ణయంతో స్మార్ట్ ఫోన్ రేట్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Survey
✅ Thank you for completing the survey!
Budget 2025:
ఈరోజు నుంచి పార్లమెంట్ లో ప్రారంభమైన 2025 బడ్జెట్ సమావేశం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025 ని ప్రవేశపెట్టారు. ఇందులో, టెక్నాలజీ మరియు తయారీ రంగం పై కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. బడ్జెట్ 2025 ద్వారా సెమీ కండక్టర్, బ్యాటరీలు మరియు పునరుత్పాదక ఎనర్జీ పరికరాల తయారీ మరింత చౌకగా మారనున్నాయి.
ఎందుకంటే, కొత్త బడ్జెట్ నుంచి కోబాల్ట్, ఓపెన్ సెల్స్, లిథియం అయాన్ బ్యాటరీ వెస్ట్, లెడ్, జింక్, మరియు 12 ఇతర ముడి సరుకుల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) ని తగ్గించారు. ఈ కొత్త చర్య మేక్ ఇన్ ఇండియా కోసం ఇతర దేశాల పెద్ద కంపెనీలు ఆహ్వానించడానికి కూడా సహకరిస్తుంది.
ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే లపై ప్రస్తుతం వున్న 10% నుంచి 20% కు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) పెంచింది. అయితే, ఓపెన్ సెల్స్ మరియు దీని రిలేటెడ్ కాంపోనెంట్స్ పై BCD ని 5% తగ్గించింది. ఇళ్ల చేయడం ద్వారా లిథియం బ్యాటరీలతో పోనీ చేసే స్మార్ట్ ఫోన్ లు మరియు ఎలక్ట్రిక్ కార్స్ ధరల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అంటే, స్మార్ట్ ఫోన్ లతో పాటు లిథియం బ్యాటరీ తో పని చేసే చాలా పరికరాల రేట్లు తగ్గే అవకాశం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.