Claude AI India Subscription Pricing in India
Claude AI India: ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్న AI చాట్ బాట్స్ లో Anthropic రూపొందించిన Claude AI ఒకటి. ఇది కోడింగ్, కంటెంట్ రైటింగ్, డేటా విశ్లేషణ, డాక్యుమెంట్ సమరీ, రీసెర్చ్ వంటి పనుల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. అయితే, ఈ షబ్ తాజాగా భారతీయ వినియోగదారులకు కంపెనీ మరో శుభవార్త చెప్పింది. అయితే, ఈ ఏఐ సర్వీస్ ను పొందాలంటే సబ్ స్క్రిప్షన్ కోసం కేవలం డాలర్స్ లో మాత్రమే ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ ఎట్టకేలకు క్లాడ్ AI ఇండియా సబ్ స్క్రిప్షన్ ను భారతీయ రూపాయల్లో (INR) కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటి వరకు భారతీయ యూజర్లు కేవలం అమెరికన్ డాలర్లలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు, బ్యాంక్ ఫీజులు వంటి అదనపు ఖర్చు యూజర్లు భరించాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఇండియాలో లోకల్ ప్రైసింగ్ (Local Pricing) అమల్లోకి తెచ్చింది. ఈ అవకాశం తో యూజర్లు రూపాయల్లోనే సబ్ స్క్రిప్షన్ తీసుకునే అవకాశం లభిస్తోంది. అంతేకాదు, ఈ ప్రైసింగ్ లో GST కూడా చేర్చబడినట్లు కంపెనీ తెలిపింది. భారతీయ యూజర్లకు స్మూత్ ట్రాన్సాక్షన్ కోసం మరియు యూజర్ బేస్ ను మరింత పెంచడానికి ఈ కొత్త చర్య తీసుకున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
భారత్ లో క్లాడ్ ప్రో ప్లాన్ ధర నెలకు సుమారు రూ. 1,999 నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా క్లాడ్ మ్యాక్స్ మరియు క్లాడ్ టీమ్ ప్లాన్ లకు కూడా భారతీయ ధరలను Anthropic ప్రకటించింది. వ్యక్తిగత వినియోగదారులు, స్టార్టప్స్, డెవలపర్లు, వ్యాపార సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సరైన ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఉచిత (Free) వెర్షన్ కూడా భారతీయ వినియోగదారులకు అందుబాటులో కొనసాగుతుంది.
క్లాడ్ ఏఐ ప్రత్యేకత ఏమిటంటే పెద్ద PDF ఫైళ్లను విశ్లేషించడం, పొడవైన డాక్యుమెంట్లను అర్థం చేసుకోవడం, క్లిష్టమైన కోడ్ ను రూపొందించడం మరియు సహజమైన భాషలో సమాధానాలు ఇవ్వడం వంటి పనులు చాలా వేగంగా నిర్వహిస్తుంది. అందుకే, విద్యార్థులు, సాఫ్ట్ వేర్ డెవలపర్లు, కంటెంట్ క్రియేటర్లు మరియు వ్యాపార సంస్థలు క్లాడ్ ఏఐ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Also Read: Nothing Phone 3b ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.!
ప్రస్తుతం UPI ద్వారా చెల్లింపు సదుపాయం ఇంకా అందుబాటులో లేదు. వినియోగదారులు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించే అవకాశం అందించింది. అలాగే, Apple App Store లేదా Google Play బిల్లింగ్ ద్వారా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో UPI సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే, Anthropic Claude India Subscription భారతీయ రూపాయిలో అందుబాటులోకి రావడం భారతీయ AI వినియోగదారులకు పెద్ద ఊరటనిచ్చే పరిణామం అవుతుంది. అంతర్జాతీయ పేమెంట్ ఇబ్బందులు తగ్గడంతో పాటు ఖర్చులు చాలా స్పష్టంగా కనిపించడం వల్ల క్లాడ్ ఏఐ సేవలను మరింత మంది భారతీయులు సులభంగా ఉపయోగించడం సాధ్యం అవుతుంది.