Nothing Phone 3b ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది.!
Nothing Phone 3b ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది
ఇది నథింగ్ b సిరీస్ నుంచి విడుదల చేసిన మొదటి ఫోన్
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తో పాటు గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా అందించింది
Nothing Phone 3b ఫస్ట్ సేల్ నుంచి భారీ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఇది నథింగ్ b సిరీస్ నుంచి విడుదల చేసిన మొదటి ఫోన్ మరియు గొప్ప ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ తో పాటు గొప్ప లాంచ్ ఆఫర్లు కూడా అందించింది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి లభించే ఆఫర్లు మరియు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.
SurveyNothing Phone 3b : సేల్ అండ్ ఆఫర్స్
నథింగ్ ఫోన్ 3బి స్మార్ట్ ఫోన్ జూలై 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ ర్యామ్ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 34,999 ప్రైస్ తో మరియు (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 38,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించడం ద్వారా ఈ ఫోన్ ను 30 వేల కంటే తక్కువ ధరలో అందుకునే అవకాశం అందిచింది.

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పైన రూ. 2,375 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ తో పాటు రూ. 2,625 రూపాయల ICICI, HDFC, SBI మరియు Axis బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి కేవలం రూ. 29,999 ఆఫర్ ధరలో లభిస్తుంది.
Nothing Phone 3b : ఫీచర్స్
నథింగ్ ఫోన్ 4b లో డ్రాగన్ టేల్ ప్రో గ్లాస్ రక్షణ కలిగిన 6.77 ఇంచ్ Super AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే గొప్ప 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 6 Gen 4 తో పని చేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్ జతగా 256 జీబీ వరకు అంతర్గత మెమరీ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లేటెస్ట్ ఫోన్ 50MP ప్రధాన (OIS అండ్ EIS) సెన్సార్ జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 30FPS 4K వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు నథింగ్ యొక్క ప్రత్యేకమైన Ultra XDR సపోర్ట్ మరియు AI సెమెటిక్ సెగ్మెంటేషన్ వంటి ప్రీమియం కెమెరా ఫీచర్స్ తో వస్తుంది.
Also Read: Price Cut: హెవీ సౌండ్ అందించే Samsung Dolby Atmos ఫ్రేమ్ స్పీకర్ సగం ధరకే లభిస్తోంది.!
ఈ ఫోన్ 6,000 mAh భారీ బ్యాటరీ, 33 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 7.5 W రివర్స్ ఛార్జ్ సెటప్ తో వస్తుంది. అలాగే, డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఈ ఫోన్ IP 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉంది. Nothing OS 4.1 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS పై ఈ ఫోన్ పని చేస్తుంది. ఇది 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ సపోర్ట్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ కోసం సపోర్ట్ చేస్తుందని నథింగ్ తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
