ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే మీ ఇంటికి కూలర్ ఎంచుకోవచ్చు..!!

ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే మీ ఇంటికి కూలర్ ఎంచుకోవచ్చు..!!
HIGHLIGHTS

కూలర్ కొనే ముందుగా ఈ విషయాలు గుర్తచుకోండి

ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే మీ ఇంటికి కూలర్ ఎంచుకోవచ్చు

మీకు తగిన బడ్జెట్ లో మంచి ఎయిర్ కూలర్ ఎంచుకోవచ్చు

ఒక మంచి బ్రాండెడ్ రూమ్ కూలర్ కొనాలంటే కనీసం పదివేల రూపాయలైనా ఖర్చు చేయాల్సిందే. అందుకే, డబ్భును ఖర్చుచేసే ముందుగా మనకు తగిన మరియు సరైన ప్రోడక్ట్ నే తీసుకుంటున్నామా లేక లేదా అని చూసుకోవాలి. ఈ మూడు విషయాలు గుర్తుంచుకుంటే మీ ఇంటికి కూలర్ ఎంచుకోవచ్చు. అంతేకాదు, మీకు తగిన బడ్జెట్ లోనే మీ ఇంటికి తగిన ఒక మంచి ఎయిర్ కూలర్ ఎంచుకోవచ్చు.

1.గది సైజ్

మనం ఎటువంటి కూలర్ ని కొనాలనుకుంటున్నామో ముందుగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే, కేవలం ఒక్కరు ఇద్దరి కోసం అయితే పర్సనల్ కూలర్ సరిపోతుంది. కానీ, మీ రూమ్ మొత్తం చల్లని గాలితో నింపాలంటే  మాత్రం డెజర్ట్ కూలర్ ని తీసుకోవాల్సి వుంటుంది.

2.ట్యాంక్ పరిమాణం

ఒక ఎయిర్ కూలర్ తీసుకునేప్పుడు అతిముఖ్యంగా చూడాల్సిన విషయం వాటర్ ట్యాంక్ కెపాసిటీ.  ఎయిర్ కూలర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఎక్కువగా ఉంటుందో, కూలర్ కూడా అంత ఎక్కవ కూలింగ్ కెపాసిటీని కలిగి వుంటుంది. ఒక చిన్న రూమ్ కోసం 15 లీటర్ల కెపాసిటీ, మీడియం సైజు రూమ్ కోసం 25 లీటర్ల కెపాసిటీ మరియు పెద్ద రూమ్ కోసం కనీసం 40 లీటర్ల కెపాసిటీ గల కూలర్ ను ఎంచుకోవాలి.

3.కూలింగ్ ప్యాడ్స్

ఇక మరొక ముఖ్యమైన విషయం కూలర్ ప్యాడ్స్. ఎందుకంటే, కూలర్ కూలింగ్ ని నిర్ణయించేది కూలింగ్ ప్యాడ్స్. మూడు రకాలైన ప్యాడ్స్ తో కూలర్లు వస్తాయి. 1. చెక్క గ్రాస్ కూలర్ ప్యాడ్స్ 2. ఆస్పెన్ చెట్టు గ్రాస్ ప్యాడ్స్ 3. హాని కోంబ్ ప్యాడ్స్.  ఈ మూడు రకాల కూలింగ్ ప్యాడ్స్ లో కూడా హాని కోంబ్ ప్యాడ్స్ ఉత్తమంగా ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo