PUBG కష్టాలు: విడుదలకు ముందే బ్యాన్ చెయ్యాలని వినతులు

HIGHLIGHTS

ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా

ఇండియాలో నేరుగా PUBG రిలీజ్ చెయ్యడానికి Krafton రెడీ

దీని గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖను సమర్పించారు

PUBG కష్టాలు: విడుదలకు ముందే బ్యాన్ చెయ్యాలని వినతులు

ఇండియాలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఇండియాలో నేరుగా PUBG రిలీజ్ చెయ్యడానికి Krafton రెడీ అయ్యింది. అంతేకాదు, ఇప్పటికే Pre-Registrations ను కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి మొదలుపెట్టింది. ఇండియాలో అత్యధికముగా ఆదరించబడిన PUBG మళ్ళా వస్తుందనే ఆనందం కొందరిలో వుంది. పూర్తిగా కొత్త వెర్షన్ గేమ్ అంధక పోయినా అదే గేమ్ ను ఆస్వాదించవచ్చని చాలా మంది గేమింగ్ ప్రియులు సంబరపడ్డారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఆయితే,  బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ని ఇండియాలో రాకుండా కట్టడి చెయ్యాలని చేయాలనీ చాలా రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు నేరుగా ప్రధాన మంత్రిని అభ్యర్ధించడం గమనార్హం. అరుణాచల్ ప్రదేశ్ మాజీ యూనియన్ మినిష్టర్ దీని గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖను సమర్పించారు. అంతేకాదు, మరికొందరి నుండి కూడా నిరశనలు వ్యక్త మవుతున్నాయి.

మరి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా లాంచ్ ఆగుతుందా? అనే కోణంలో చూస్తే మాత్రం Krafton సంస్థ ప్రాధమిక రూల్స్ మరియు రెగ్యులేషన్స్ ను ఫాలో చేసినంతకాలం ఎటువంటి ఇబ్బంది ఉండక పోవచ్చని కొన్ని నివేదికలు వెల్లడించాయి. వాస్తవానికి, ఇప్పటికి ఈ గేమ్ యొక్క లాంచ్ డేట్ ని ప్రకటించనే లేదు. కేవలం, ప్రీ రిజిస్ట్రేషన్స్ ను మాత్రమే మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తుంటే విడుదలకు  ముందే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ కి చాలా హిప్ క్రియేట్ అయ్యేలా కనిపిస్తోంది.                                                              

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo