Bank of Baroda Data Leak confirmed and know about customer data
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్ డేటా లీక్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ న్యూస్ గా మారింది. ఈ ఘటన పై బ్యాంక్ అధికారికంగా స్పందించింది మరియు దీనికి దారి తీసిన కారణాలు కూడా వెల్లడించింది. ఒక ఉద్యోగి ఈమెయిల్ ఖాతా అనధికారికంగా యాక్సెస్ చేయబడడంతో, కొంతమంది అకౌంట్ హోల్డర్స్ సమాచారం బయటకు లీక్ అయినట్లు బ్యాంక్ ధృవీకరించినట్లు సమాచారం. అయితే, ఇందులో ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఒక ఉద్యోగి ఈమెయిల్ ఖాతా అనధికారికంగా యాక్సెస్ చేయబడడంతో కొంత కస్టమర్ సమాచారం బయటకు వెళ్లినట్లు బ్యాంక్ ధృవీకరించింది. ప్రాథమిక రిపోర్ట్స్ ప్రకారం, కొంతమంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, గుర్తింపు పత్రాల కాపీలు, రుణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు మరియు కొన్ని అంతర్గత డాక్యుమెంట్లు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. అయితే, ఎంతమంది వినియోగదారుల సమాచారం ప్రభావితమైంది, అనే కచ్చితమైన నెంబర్ లేదా డేటాని బ్యాంక్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
ఇందులో కొంచెం ఆందోళన కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే, ఒకవేళ యూజర్ వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లి ఉంటే, వారికి ఫిషింగ్ ఈమెయిల్స్, నకిలీ కాల్స్ లేదా SMS స్కామ్స్ ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. స్కామర్లు బ్యాంక్ పేరుతో సంప్రదించి OTP, PIN లేదా నెట్ బ్యాంకింగ్ వివరాలు అడిగే ప్రయత్నం చేయవచ్చు. ఇది అకౌంట్ హోల్డర్స్ కి చాలా ఇబ్బంది కలిగించే విషయం కావచ్చు.
ఈ డేటా లీక్ గురించి ఖాతాదారులకు ఊరట నిచ్చే మంచి విషయం కూడా ఉంది. అదేమిటంటే, బ్యాంక్ అఫీషియల్ స్టేట్మెంట్ ప్రకారం కోర్ బ్యాంకింగ్ సిస్టం హ్యాక్ కాలేదు. ఈ హ్యాక్ గురించి తెలిసిన వెంటనే బ్యాంక్ వెంటనే దర్యాప్తు ప్రారంభించింది మరియు భద్రతా చర్యలను కూడా మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, అనుమానాస్పద కార్యకలాపాల మీద నిఘా పెంచినట్లు కూడా వెల్లడించింది.
అన్నింటికంటే ముఖ్యమైన సమాచారం ఏమిటంటే, అకౌంట్ హోల్డర్స్ ఖాతాల్లో ఉన్న డబ్బు పై ఎటువంటి నష్టం వాటిల్ల లేదు మరియు అటువంటి అవకాశం కూడా లేదని కూడా చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమయాల్లో ఖాతాదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
Also Read : Redmi Note 17 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రిలీజ్ .. భారీ బ్యాటరీ తో వస్తుంది.!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉంది. అయితే, కొంత కస్టమర్ సమాచారం ఉద్యోగి ఈమెయిల్ ఖాతా ద్వారా లీక్ అయినట్లు ధృవీకరించింది. కాబట్టి ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ, అకౌంట్ హోల్డర్స్ అప్రమత్తంగా ఉండడం మంచిది.