are you not able to check you EPFO Balance know why it happened
మీ EPFO Balance చూడలేక పోతున్నారా? అయితే, ఇది కేవలం మీకు మాత్రమే ఎదురైన సమస్య కాదు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన డిజిటల్ సేవలను మరింత వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు ఈరోజు నుంచి కీలకమైన సిస్టమ్ అప్ గ్రేడ్ పనులు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2026 జూన్ 26 నుంచి అంటే ఈరోజు నుంచి జూన్ 30 వరకు ఈపీఎఫ్ కి సంబంధించిన పలు ఆన్ లైన్ సర్వీస్ లు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని సంస్థ ప్రకటించింది. అందుకే, లక్షలాది మంది ఉద్యోగులు తమ EPF బ్యాలెన్స్, పాస్ బుక్ మరియు క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను ఈ ఐదు రోజులు చూసే అవకాశం ఉండదు.
పైన తెలిపిన విధంగా ఐదు రోజుల పాటు EPFO Member Portal, Employer Portal, అలాగే UMANG యాప్ లోని EPFO సేవలు కూడా పూర్తిగా లేదా పాక్షికంగా నిలిపివేయబడతాయి. కొత్త క్లెయిమ్ లు దాఖలు చేయడం, పాస్ బుక్ డౌన్ లోడ్ చేసుకోవడం మరియు UAN సంబంధిత సేవలు కూడా పని చేయవు. అంటే, వినియోగించడం తాత్కాలికంగా సాధ్యం కాకపోవచ్చు.
అయితే, ఈ సర్వర్ అప్ గ్రేడ్ చేయడం పూర్తయిన తర్వాత అన్ని సేవలు మళ్లీ సాధారణంగా ప్రారంభమవుతాయని EPFO వెల్లడించింది. కాబట్టి, ఈ ఐదు రోజులు EPF బ్యాలెన్స్ కనిపించకపోయినా లేదా పాస్‌బుక్ ఓపెన్ కాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
అంతేకాదు, జూన్ 30 తర్వాత సర్వీస్ పూర్తిగా పునరుద్ధరించబడిన తర్వాత తిరిగి ప్రయత్నించండి, అని ఈపీఎఫ్ఓ సూచించింది. అయితే, అత్యవసర అవసరాలు ఉన్న ఉద్యోగులు తమ సంస్థ HR విభాగాన్ని సంప్రదించడం లేదా సేవలు తిరిగి ప్రారంభమైన తర్వాత అధికారిక ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా వివరాలను పరిశీలించడం మంచిది. ఈ అప్ గ్రేడ్ ద్వారా భవిష్యత్తులో ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ సేవలు మరింత వేగంగా మరియు స్థిరంగా, సురక్షితంగా అందుబాటులోకి రానున్నాయి.
Also Read: భారీ ఆఫర్స్ తో Oppo Reno 16 Series ముందస్తు బుకింగ్ స్టార్ట్ చేసిన ఒప్పో.!