భారీ ఆఫర్స్ తో Oppo Reno 16 Series ముందస్తు బుకింగ్ స్టార్ట్ చేసిన ఒప్పో.!
Oppo Reno 16 Series లాంచ్ కోసం టీజింగ్ వేగం పెంచింది
ముందస్తు రిజర్వేషన్ బుకింగ్ కూడా ప్రారంభించింది
యూజర్ల కోసం భారీ డీల్స్ మరియు ఆఫర్లు కూడా అందించింది
Oppo Reno 16 Series ఇండియా లాంచ్ సమయం దగ్గరకు వచ్చే కొద్దీ ఈ అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ వేగం పెంచింది. కేవలం టీజర్ వేగం మాత్రమే కాదు ఈ ఫోన్ ముందస్తు రిజర్వేషన్ బుకింగ్ కూడా పారంభించింది. ఈ ఫోన్ ను ముందుగా రిజర్వ్ చేసుకునే యూజర్ల కోసం భారీ డీల్స్ మరియు ఆఫర్లు కూడా అందించింది. ఒప్పో అప్ కమింగ్ ముందస్తు రిజర్వేషన్ మరియు ఈ ఫోన్ పై ఒప్పో అందించిన డీల్స్ ఏమిటో చూద్దామా.
SurveyOppo Reno 16 Series : ప్రీ రిజర్వేషన్ ఆఫర్
ఒప్పో రెనో 16 సిరీస్ ను ముందుగా రిజర్వ్ చేసుకోవడానికి, ప్రీ రిజర్వేషన్ ఆఫర్ ని ఒప్పో ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకమైన ప్రీ రిజర్వేషన్ బెనిఫిట్స్ జత చేసింది. ఈ బెనిఫిట్స్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
- ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో ప్లస్ పై 50% డిస్కౌంట్
- అమెజాన్ ఎకో పాప్ పై రూ. 1,000 డిస్కౌంట్
- రూ. 800 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్
- రూ. 1,000 స్టూడెంట్ డిస్కౌంట్
- 180 రోజుల స్క్రీన్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్
- 18 నెలల జెమినీ ప్రో యాక్సెస్ (జియో సిమ్ తో)
- 3 నెలల గూగుల్ Ai ప్రో యాక్సెస్
Oppo Reno 16 Series : ఫీచర్స్
ఒప్పో రెనో 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లు సరికొత్త 3D పాప్ ప్లానెట్ డిజైన్ తో లాంచ్ అవుతాయి. ఈ డిజైన్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అని ఒప్పో తెలిపింది. ఇందులో సరికొత్త హోలో వెర్స్ 3D టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ మరింత అందంగా మరియు ఆకర్షణీయంగా మార్చింది.

ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ లో ఉంటుంది మరియు సైడ్ లో ప్రత్యేకమైన AI బటన్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP (3.5x) టెలిఫోటో కెమెరా ఉంటుంది. అలాగే మరో రెండు కెమెరాలు ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
ఈ ఫోన్ లో కొత్తగా AI రీమిక్స్ కొలాజ్ ఫీచర్ ని జత చేసినట్లు ఒప్పో వెల్లడించింది. ఇందులో బిగ్ vs స్మాల్, ట్రావెల్ డంప్, స్టిల్ vs మోషన్ వంటి ఏఐ రీమిక్స్ కొలాజ్ లు ఉంటాయి. అంతేకాదు, లైట్ లీక్, డిజి క్యామ్ ఇన్స్టాంట్ ఫిల్మ్ వంటి పాప్ కామ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ గరిష్టంగా 60FPS 4K HDR వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది.
Also Read: Prime Day Sale టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసిన అమెజాన్.!
ఈ అప్ కమింగ్ సిరీస్ ఒప్పో యొక్క లేటెస్ట్ ColorOS 16 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 తో లాంచ్ అవుతుంది. ఇది స్మార్ట్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
