Apple Event 2024 it’s Glow Time భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. ఈ ఈవెంట్ కాలిఫోర్నియాలోని ఆపిల్ కాపర్టీనో పార్క్ వేదిక అవుతుంది. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ మెగా వ్ ఈవెంట్ ను యాపిల్ నిర్వహిస్తుంది. ఈ లాంచ్ ఈవెంట్ నుంచి iPhone 16 Series తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసే అవకాశం వుంది. ఈ లాంచ్ ఈవెంట్ ను ఆన్లైన్లో లో లైవ్ చూడవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Apple Event 2024
‘ఇట్స్ గ్లో టైమ్’ యాపిల్ ఈవెంట్ ఈరోజు భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 10:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే, ఇది US కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు అక్కడ మొదలవుతుంది. ఈ లాంచ్ ఈవెంట్ లైవ్ ను apple.com మరియు ఆపిల్ టీవీ యాప్ ద్వారా ప్రసారం చేస్తుంది. అంతేకాదు, ఆపిల్ అధికారిక Youtube ఛానెల్ ద్వారా కూడా ఈ లైవ్ కార్యక్రమం చూడవచ్చు. ఒక మీరు నేరుగా లైవ్ చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు.
యాపిల్ ఈవెంట్ 2024 నుంచి ఐఫోన్ 16 సిరీస్ నుంచి 4 కొత్త ఫోన్ లను విడుదల చేస్తుందని రూమర్లు ఉన్నాయి మరియు అంచనా కూడా వేస్తున్నారు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఐఫోన్ ల అంచనా స్పెక్స్ తో నివేదికలు కూడా అందించారు. ఈ సిరీస్ నుంచి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మరియు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ విడుదల చేస్తుందని చెబుతున్నారు.
ఈ అప్ కమింగ్ మోడల్స్ ను కొత్త గ్లాస్సి లుక్ కోసం ప్రోసెసెస్ ను ఉపయోగించినట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే, ఐఫోన్ 15 సిరీస్ లో డల్ గా కనిపించే అల్యూమినియం లుక్ నుంచి ఐడి పెద్ద అప్గ్రేడ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ లను A18 Bionic చిప్ సెట్ మరియు లేటెస్ట్ iOS 18 తో లాంచ్ చేస్తుందని కూడా చెబుతున్నారు.
ఈ యాపిల్ ఈవెంట్ నుంచి యాపిల్ Watch Series 10 మరియు Airpods 4 లను కూడా విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఈవెంట్ నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది మరియు వాటి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాము.