భారీ ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది

HIGHLIGHTS

అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది

అమెజాన్ అప్ కమింగ్ సేల్

ఆకర్షణీయమైన డీల్స్

భారీ ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది

అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తీసుకుస్తున్న ఈ అప్ కమింగ్ అమెజాన్ సేల్ నుండి అనేకమైన ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగష్టు 5 వతేదీ నుండి ఆగష్టు 9 వతేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ను SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. కాబట్టి, SBI క్రెడిట్ కార్డ్ తో వస్తువులను కొనుగోలుచేసే కస్టమర్లకు 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ ప్రైమ్ డే సేల్ తరువాత వస్తున్న ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి ఆన్‌లైన్ రిటైలర్ ఆఫర్స్ మరియు డిస్కౌంట్‌ లతో స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు ఉపకరణాలు, ఫ్యాషన్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ అందిస్తుంది. టీవీలు, వాషింగ్ మెషీన్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ పైన మంచి ఆఫర్లతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన డీల్స్ కూడా అందించనుంది.

టీవీలు మరియు వాషింగ్ మెషీన్స్ వంటి అప్లయన్సెస్ పైన గరిష్టంగా 55% వరకూ భారీ డిస్కౌంట్ ని ప్రకటించింది. అంటే, ఈ అమెజాన్ సేల్ నుండి బ్రాండెడ్ టీవీ లేదా వాషింగ్ మెషిన్ ను కేవలం సగం ధరకే పొందేవీలుంటుంది. No cost EMI, ఎక్స్చేంజ్ అఫర్ మరియు కావాల్సిన సమయానికి ప్రోడక్ట్స్ ని ఇంటి వద్ద అందుకునే విధంగా షెడ్యూల్డ్ డెలివరీ అవకాశం కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo