amazon announced Amazon Great Summer Sale with big deals
అమెజాన్ ఇండియా 2026 సమ్మర్ సీజన్ కోసం తన అప్ కమింగ్ బిగ్ సేల్ అనౌన్స్ చేసింది. అదే Amazon Great Summer Sale మరియు ఈ సేల్ నుంచి భారీ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది. ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా ఇప్పటికే రివీల్ చేసింది. ఇది కాకుండా ఈ సేల్ నుంచి గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుకోవచ్చని అమెజాన్ ఈ సేల్ గురించి భారీగా టీజింగ్ చేస్తుంది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 8 మే 2026 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్ ను HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో అందించింది. అందుకే, ఈ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను అమెజాన్ అందించింది. ఇది మాత్రమే కాదు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ వంటి మరిన్ని డీల్స్ కూడా ఈ సేల్ నుంచి అందుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అందించనున్న కొన్ని బిగ్ డీల్స్ ను ఇప్పటికే అమెజాన్ రివీల్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ డీల్ ఈ సేల్ నుంచి అందించిన బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ గా అమెజాన్ టీజింగ్ చేసింది. ఈ సేల్ నుంచి ఆనందించిన అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 94,999 రూపాయల డిస్కౌంట్ ధరలో పొందొచ్చని అమెజాన్ ప్రకటించింది.
ఈ సేల్ నుంచి అందించే మరిన్ని డీల్స్ కూడా రివీల్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ మరియు ఐకూ లేటెస్ట్ ఫోన్ ఐకూ 15R స్మార్ట్ ఫోన్ లను కూడా మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజర్ పేజీ లో తెలిపింది. అంతేకాదు, ఈ సేల్ నుంచి ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 15 తో పాటు మరిన్ని ఐఫోన్ లను కూడా మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
Also Read: కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఇక ఈ సేల్ నుంచి అందించే ఇతర డీల్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి లేటెస్ట్ AC లు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీలు మరియు సౌండ్ బార్స్ వంటి చాలా ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.