భారీ ఆఫర్స్ తో Amazon Great Summer Sale అనౌన్స్ చేసిన అమెజాన్.!
అమెజాన్ ఇండియా 2026 సమ్మర్ సీజన్ కోసం తన అప్ కమింగ్ బిగ్ సేల్ అనౌన్స్ చేసింది
Amazon Great Summer Sale నుంచి భారీ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది
ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా ఇప్పటికే రివీల్ చేసింది
అమెజాన్ ఇండియా 2026 సమ్మర్ సీజన్ కోసం తన అప్ కమింగ్ బిగ్ సేల్ అనౌన్స్ చేసింది. అదే Amazon Great Summer Sale మరియు ఈ సేల్ నుంచి భారీ డీల్స్ అందుకోవచ్చని అమెజాన్ చెబుతోంది. ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కూడా ఇప్పటికే రివీల్ చేసింది. ఇది కాకుండా ఈ సేల్ నుంచి గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుకోవచ్చని అమెజాన్ ఈ సేల్ గురించి భారీగా టీజింగ్ చేస్తుంది.
SurveyAmazon Great Summer Sale స్టార్టింగ్ డేట్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 8 మే 2026 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్ ను HDFC బ్యాంక్ భాగస్వామ్యంతో అందించింది. అందుకే, ఈ సేల్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను అమెజాన్ అందించింది. ఇది మాత్రమే కాదు అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ మరియు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ వంటి మరిన్ని డీల్స్ కూడా ఈ సేల్ నుంచి అందుకోవచ్చు.
Amazon Great Summer Sale : డీల్స్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుంచి అందించనున్న కొన్ని బిగ్ డీల్స్ ను ఇప్పటికే అమెజాన్ రివీల్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ డీల్ ఈ సేల్ నుంచి అందించిన బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ గా అమెజాన్ టీజింగ్ చేసింది. ఈ సేల్ నుంచి ఆనందించిన అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 94,999 రూపాయల డిస్కౌంట్ ధరలో పొందొచ్చని అమెజాన్ ప్రకటించింది.

ఈ సేల్ నుంచి అందించే మరిన్ని డీల్స్ కూడా రివీల్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ మరియు ఐకూ లేటెస్ట్ ఫోన్ ఐకూ 15R స్మార్ట్ ఫోన్ లను కూడా మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ టీజర్ పేజీ లో తెలిపింది. అంతేకాదు, ఈ సేల్ నుంచి ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 15 తో పాటు మరిన్ని ఐఫోన్ లను కూడా మంచి డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది.
Also Read: కేవలం రూ. 6,499 డిస్కౌంట్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
ఇక ఈ సేల్ నుంచి అందించే ఇతర డీల్స్ విషయానికి వస్తే, ఈ సేల్ నుంచి లేటెస్ట్ AC లు, ఎయిర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ టీవీలు మరియు సౌండ్ బార్స్ వంటి చాలా ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేస్తోంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
