కరెంట్ బిల్ రాదు.. పవర్ తో పనిలేదు.. సోలార్ AC లు ఉంటే చాలు..!!

HIGHLIGHTS

ఎండ తీవ్రత నానాటికి మరింత ఉదృతంగా మారుతోంది.

కొన్ని చోట్ల కరెంట్ కోతలు కూడా పెరుగుతున్నాయి

సోలార్ AC లతో కరెంట్ కోతల సమస్య ఉండవు

కరెంట్ బిల్ రాదు.. పవర్ తో పనిలేదు.. సోలార్ AC లు ఉంటే చాలు..!!

ఎండ తీవ్రత నానాటికి మరింత ఉదృతంగా మారుతోంది. ఇప్పటికే, తెలుగురాష్ట్రాల ప్రజలతో పాటుగా దక్షిణ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. వీటితో పాటు పెరిగిన ఆయిల్ రేట్లు మరియు ఇంధన కొరత పవర్ షార్టేజ్ కి దారితీస్తోంది. దీనికారణంగానే, కొన్ని చోట్ల కరెంట్ కోతలు కూడా పెరుగుతున్నాయి.  మరి వేడి గాలుల నుండి మీ కుంటుంబాన్ని రక్షించాలంటే పవర్ తో పనిలేని ఏకైక మార్గం సోలార్ AC. కూలర్లు, ఫ్యాన్లు కూడా వేడిమికి ధాటికి విఫలమవుతున్న ఈ సీజన్‌లో కేవలం ఎయిర్ కండీషనర్ (ఏసీ) మాత్రమే సమర్ధవంతంగా పని చేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, AC కొనడానికి ముందుగా ఆలోచించేది కరెంట్ బిల్లు మాత్రమే కాదు వేసవిలో వుండే కరెంట్ కోతలు కూడా తోడు కావచ్చు. ఈ సమస్యలన్నింటికీ సోలార్ AC లతో చెక్ పెట్టవచ్చు. సోలార్ AC లతో కరెంట్ కోతల సమస్య ఉండవు, కరెంట్ బిల్ సమస్య అంతకన్నా ఉండదు. అందుకే, సోలార్ AC ల గురించి వివరంగా తెలుసుకుందాం.    

సోలార్ AC: 

ఎండ తీవ్రత పెరిగే కొద్ది పగలు రాత్రి అనే తేడా లేకుండా AC లకు పనిచెబుతారు. మరి కరెంట్ బిల్లు మాటేమిటి? అనేది అందిరికి వచ్చే మొదటి ప్రశ్న. కానీ సోలార్ AC లతో మీరు చింతించాల్సిన అవసరం ఉండదు. దీనికోసమే, మేము మీకు సోలార్ AC గురించి సమాచారాన్ని అందించబోతున్నాము. సోలార్ AC లు  విద్యుత్తుతో కాకుండా సౌరశక్తితో పనిచేస్తాయి. సోలార్ AC ల ప్లేట్లు సూర్యుడి నుండి శక్తిని గ్రహించి, ACని నడిపించడానికి సహాయపడతాయి. ఈ సోలార్ AC లతో వచ్చే బ్యాటరీలు సూర్యకాంతి ద్వారా మాత్రమే ఛార్జ్ చేయబడతాయి.

ఇంత వరకూ చెప్పినదంతా బాగానే వుంది, మరి సోలార్ AC లను ఎందుకు ఎక్కువగా కొనుగోలు చెయ్యడం లేదు? అనేది మీకు వచ్చే ప్రశ్న కావచ్చు. దీనికి ప్రధాన కారణం ధర అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. సోలార్ AC ధర సాధారణ AC కంటే చాలా ఎక్కువ, కానీ ఒక సారి పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు ఎప్పటికీ విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంటే, యావరేజ్ గా నెలకు 2,000 రూపాయల కరెంట్ బిల్లు సేవింగ్ ను చొప్పున కేవలం 3 సంవత్సరాల్లోనే మీ సోలార్ AC కొనుగోలు చేసిన డబ్బు సేవ్ అవుతుంది.

SINFIN 1.5 Ton Solar PCU Split Inverter AC

సిన్ ఫిన్ యొక్క ఈ 1.5 టన్ సోలార్ AC మంచి ఎనర్జీ ఎఫిసియెంట్ తో వస్తుంది మరియు మీ ఎలక్ట్రిసిటీ బిల్ లో 70% వరకు ఆదాచేస్తుంది. ఇది సాంప్రదాయ AC ల మాదిరిగా కాకుండా కన్వెన్షన్ ఏసీ మాదిరిగా పనిచేస్తుంది. ఇది సోలార్ పవర్, బ్యాటరీ బ్యాంక్ మరియు ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మూడింటితో పనిచేస్తుంది. ఇది కరెంట్ తో పనిలేకుండా నడుస్తుంది లేదంటే మీకు అవసరమైనప్పుడు కరెంట్ తో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది సోలార్ AC ని గురించి మీరు కంపెనీ వెబ్ సైట్ నుండి పూర్తి వివరాలను చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo