క్రిప్టో పూర్తిస్థాయిలో క్రమ బద్దీకరణ లేని వ్యవస్థ గా గోచరిస్తుంది. అందుకే, భారతదేశంలో పూర్తిగా క్రమబద్దీకరించడానికి క్రిప్టో ఇండస్ట్రీ పైన నియంత్రణ తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన బిల్లు ను తీసుకురావడానికి చూస్తున్నట్లు వెల్లడయింది. అంతేకాదు, ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో కనిపించడం మొదలుపెట్టాయి.
Survey
✅ Thank you for completing the survey!
Reuters యొక్క ఒక కొత్త నివేదిక ప్రకారం, ఈ బిల్లు పేమెంట్ పద్ధతిగా Crypto Currency వినియోగాన్ని నిషేధిస్తుంది. అంతేకాదు, ఈ బిల్లులో ప్రతిపాదించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించిన వారికి కఠినమైన శిక్షలను కూడా తీసుకువస్తునట్లు వివరించింది. దీని ప్రకారం, ఎంత కఠినమైన శిక్షలో తెలియరాలేదు కానీ, అధికారులలు ఎటువంటి వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేసే అధికారం కూడా కలిగి ఉంటారని తెలుస్తోంది.
వాస్తవానికి, ముందుగా వచ్చిన కొన్ని నివేదికలు కూడా క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు ఉపయోగపడాకుండా నిరోధించేలా ఈ బిల్ ఉండవచ్చని ఊహించాయి. ప్రత్యామ్నాయంగా ఇది బంగారం వంటి ఒక ఆస్తిగా ఉంచడానికి క్రిప్టో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నివేదికల ప్రకారం, ఈ విధానం వలన ఇండియాలో క్రిప్టో పూర్తి స్థాయిలో నిషేధం కాకుండా మరియు ఎక్కువ చురుకుగా ఉండకుండా చేసేలా వుంటుందని ఊహిస్తున్నారు.