జోకర్ మాల్వేర్ అలర్ట్: మీ ఫోన్ ఒక్కసారి చెక్ చేసుకోండి.. ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి..!
తాజాగా జోకర్ మాల్వేర్ భారిన పడిన 7 యాప్స్
5 లక్షలకు పైగా డౌన్లోడ్స్ సాధించిన యాప్స్ కూడా వున్నాయి
మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి
గత నెలలో దాదాపుగా 22 ఆండ్రాయిడ్ యాప్స్ జోకర్ మాల్వేర్ ను క్యారీ చేసిన కారణంగా గూగుల్ స్టోర్ నుండి తొలగించడం జరిగింది. అయితే, ఇప్పుడు మరొకసారి జోకర్ మాల్వేర్ పంజా విసిరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గురించి ముందుగా న్యూస్ 18 తాజాగా నివేదిక అందించింది. లేటెస్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోని ఒక 7 ఆండ్రాయిడ్ యాప్స్ జోకర్ మాల్వేర్ భారినపడినట్లు పేర్కొంది. అందుకే, ఈ 7 ఆండ్రాయిడ్ యాప్స్ లో ఏదైనా యాప్ మీ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే కనుక వెంటనే డిలీట్ చెయ్యడం మంచిది.
SurveyNews 18 నివేదిక ప్రకారం, మొబైల్ సెక్యూరిటీ సంస్థ Pradeo ఒక 7 ఆండ్రాయిడ్ యాప్స్ జోకర్ మాల్వేర్ భారిన పడినట్లు వెల్లడించింది. 5 లక్షలకు పైగా డౌడ్స్ సాధించిన Color Message అనే యాప్ తాజాగా జోకర్ మాల్వేర్ భారిన పడినట్లు పేర్కొంది. ఈ యాప్ రష్యన్ సర్వర్లతో కనెక్షన్స్ కలిగి ఉన్నట్లు వెల్లడైనట్లు, ఈ నివేదిక పేర్కొంది. అంతేకాదు, ఇదే విధమైన మరొక 6 యాప్స్ తో కాళీ మొత్తం 7 యాప్స్ లిస్ట్ ను కూడా రిపోర్ట్ లో పేర్కొంది.
వాస్తవానికి, ఇటీవల కూడా గూగుల్ ప్లే స్టోర్ నుండి 'ట్రోజన్' జోకర్ మాల్వేర్ బారిన పడిన ఒక 7 యాప్స్ ని గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించగా మరొక 15 యాప్స్ కూడా జోకర్ మాల్వేర్ ని క్యారీ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ Kaspersky యొక్క విశ్లేషకుడు తత్యాన సిస్కోవా వెల్లడించించారు. అంటే, గతనెలలో దాదాపుగా 22 యాప్స్ ఈ మాల్వేర్ బారిన పడ్డాయి. ఇప్పుడు కూడా ఇదే విదంగా మరొక 7 యాప్స్ దీని భారినపడ్డాయి. ఈ యాప్స్ కనుక మీ ఫోన్ లో ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ తో సహా పర్సనల్ డేటా మొత్తం ప్రమాదంలో ఉన్నట్లే. అందుకే, ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలేట్ చేయండి.
కొత్తగా జోకర్ మాల్వేర్ భారిన పడిన 7 యాప్స్ లిస్ట్ క్రింద చూడవచ్చు
1. Color Message
2. Convenient scanner 2
3. Emoji wallpaper
4. Finger Trip GameBox
5. Safety Applock
6. Separate Doc Scanner
7. Push message-TextingSMS