COVID-19 : ఈ దేశాల్లో Facebook కమ్యూనిటీ హెల్ప్ ఫీచరును ప్రారంభించింది
ప్రజలు తమ పొరుగువారికి సహాయం చేయగల లేదా సహాయం కోరే వారికీ ఉపయోగం.
COVID-19 వలన ప్రభావితమైన వ్యక్తులకు సహాయం చేయడానికి పేస్ బుక్ తన కమ్యూనిటీ హెల్ప్ ఫీచర్ యొక్క ఏకీకరణను (ఇంటిగ్రేషన్) ప్రకటించింది, ప్రజలు లాభాపేక్షలేని సంస్థలకు విరాళం ఇవ్వడానికి మరియు ప్రజలకు సహాయం చేయడానికి ఇది సహాయం చేస్తుంది.
Surveyఫేస్‌బుక్ లోని COVID-19 సమాచార కేంద్రంలో ఇచ్చిన కమ్యూనిటీ హెల్ప్ ని ప్రజలు యాక్సెస్ చేయవచ్చు. ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో కమ్యూనిటీ హెల్ప్ అనేది ప్రజలు తమ పొరుగువారికి సహాయం చేయగల లేదా సహాయం కోరే స్థలంగా చెప్పింది. ఇందులో , కిరాణా, లోకల్ ఆహార ప్యాంట్రీలు లేదా నిధుల సేకరణ మొదలైన వాటికి స్వచ్ఛందంగా ముందుకు రావడం వంటివి చేయవచ్చు.
సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం రాబోయే రోజుల్లో US, UK, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు కెనడాలో ఈ సేవలను ప్రారంభించవచ్చు. రాబోయే వారాల్లో మరిన్ని దేశాల్లో ఈ సేవను అందించబోతున్నామని కంపెనీ తెలిపింది. ఫేస్ బుక్ ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా కమ్యూనిటీ హెల్ప్ ని ప్రారంభించింది మరియు కరోనా అంటువ్యాధితో పోరాడటానికి ఇది ఉపయోగించబడుతోంది.
భారతదేశంలోని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన నకిలీ వార్తలు మరియు కరోనా (COVID-19) కి సంబంధించిన తప్పుడు సమాచారం పెరగడంతో, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లపై తప్పుడు సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంటూ ప్రభుత్వం ఒక సలహా కూడా జారీ చేసింది. దీన్ని చేయటం చాలా ముఖ్యం, అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో తప్పుడు సమాచారాన్ని అరికట్టడం చాలా అవసరం. ఫేస్‌బుక్, గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్, ట్విట్టర్, టిక్‌టాక్, షేర్‌చాట్ సహా పలు సోషల్ మీడియా సంస్థలను తమ ప్లాట్ ఫామ్‌లలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఆపమని ప్రభుత్వం కోరింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile