HIT 3: నేచురల్ స్టార్ నాని కొత్త జోనర్ లో వచ్చిన హిట్ 3 మూవీ ఇప్పుడు OTT లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఒటిటి లో రిలీజ్ అవుతుందని ఎదురు ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణ నేటితో వీడిపోయింది. ఇప్పటికే అనేక హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న నాని, హిట్ 3 సినిమా కూడా తన హిట్ ఖాతాలో కలుపుకున్నాడు. ఈ సినిమా థియేటర్ లో గొప్ప కలెక్షన్ లను సాధించడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా అనేకభాషలో OTT లో ప్రసారం అవుతోంది.
Survey
✅ Thank you for completing the survey!
HIT 3: OTT
ఎప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ తన అభిమానులకు కొత్తదనాన్ని పరిచయం చేయడమే కాకుండా ఇండస్ట్రీ సైతం కొత్తదనాన్ని పరిచయం చేసిన హీరో లలో నాని కూడా ఒకరు. తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకోవడం నాని ప్రత్యేకత. అయితే, కొత్త ప్రయోగాలు స్వాగతించడం నాని మరో ప్రత్యేకత. ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్, లవర్ బాయ్ మరియు ఫ్యామిలీ కోసం నిలబడే మనిషిగా కనిపించిన నాని, ఇప్పుడు హిట్ 3 లో పూర్తిగా వయిలెంట్ క్యారెక్టర్ లో కనిపించారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా పూర్తిగా హార్డ్ కోర్ ఎమోషనల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.
అసలు క్రిమినల్ అనేవాడు దేశంలో కనిపించకూడదు అనే సిద్ధాంతం గుండెలో నింపుకుని దానికోసం ఎంత దూరానికైనా వెళ్లడానికి సిద్దపడే డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారు. ఈ సినిమా కథతో పాటు నాని యాక్టింగ్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. కొన్ని సీన్స్ లో నాని నిజంగానే ప్రేక్షకులను భయపడేలా చేశాడంటే అతిశయోక్తి కాదు.
హిట్ సినిమా ఈరోజు నుంచి Netflix లో ప్రసారం అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 ప్లేస్ లో కొనసాగుతోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాని Dolby Vision మరియు Dolby Atmos కూడా అందించింది. ఇది సినిమా వంటి విజువల్స్ మరియు గొప్ప ఆడియో తో థియేటర్ అనుభూతిని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ నాని మూవీ తో ఎంజాయ్ చేసేయండి.