Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది

ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ GRWM GRWM సేల్ నుంచి ఈ ఆఫర్ ని ప్రకటించింది

ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ ని ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ GRWM GRWM సేల్ నుంచి ఈ ఆఫర్ ని ప్రకటించింది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ ను బడ్జెట్ ధరలో అందించిన ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ కొత్త సేల్ నుంచి కూడా మంచి ఆఫర్ ధరలో సేల్ చేసింది.

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

ఇది జెబ్రోనిక్స్ అందించిన లేటెస్ట్ సౌండ్ బార్ మరియు దీని మోడల్ పేరు BAR 9920. ఈ సౌండ్ బార్ ని జెబ్రోనిక్స్ రూ. 34,999 ధరతో మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ సౌండ్ బార్ పై రూ. 8,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 26,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది.

Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ గత సంవత్సరం వచ్చిన జెబ్రోనిక్స్ ప్రీమియం సౌండ్ బార్ గా నిలిచింది. ఇది 7.1.2 ఛానల్ సెటప్ తో ఇంటిని సినిమా థియేటర్ గా మారుస్తుంది. ఈ సౌండ్ బార్ పై భాగంలో నాలుగు అప్ ఫైరింగ్ స్పీకర్లతో పాటు ముందు మూడు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లతో జతగా రెండు సైడ్ ఫైరింగ్ స్పీకర్స్ కలిగిన ప్రీమియం బార్ కలిగి ఉంటుంది. ఈ పవర్ ఫుల్ బార్ తో జతగా గ్రౌండ్ షేక్ చేసే భారీ 12 ఇంచ్ సబ్ ఉఫర్ కూడా వస్తుంది. టోటల్ 900W జబర్దస్త్ సౌండ్ ని ఇది సౌండ్ బార్ ఆఫర్ చేస్తుంది.

ఈ సౌండ్ బార్ కలిగిన Dolby Atmos మరియు ZEB AcoustiMax మల్టీ డైమెన్షనల్ ఆడియో టెక్నాలజీతో 3D సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. సౌండ్‌ బార్‌ లో మొత్తం 9 డ్రైవర్లు ఉండటం వల్ల స్పష్టమైన డైలాగ్‌లు, శక్తివంతమైన మిడ్స్ మరియు క్లియర్ హైస్ వినిపిస్తాయి. వాల్ మౌంట్ డిజైన్, ఆరా క్యాస్ట్ సపోర్ట్ వంటి అదనపు ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. ఇది 45Hz–20kHz ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ≥66dB S/N రేషియోతో అధిక నాణ్యత గల ఆడియో అందిస్తుంది.

Also Read: Samsung Galaxy S26 Ultra 5G : రూ. 20,000 భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!

కనెక్టివిటీ పరంగా, ఈ జెబ్రోనిక్స్ సౌండ్‌ బార్‌ లో ఆప్టికల్ ఇన్, HDMI eARC, USB, AUX మరియు బ్లూటూత్ 5.3 సపోర్ట్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :