మ్యూజిక్ ప్రియుల కోసం గొప్ప ఫీచర్లతో విడుదలైన ZAKK WoodStock బ్లూటూత్ స్పీకర్

Updated on 08-May-2019
HIGHLIGHTS

భారతీయ సంగీత ప్రియులకు నచ్చేవిధంగా మంచి మిడ్స్ మరియు డిప్స్ అందించగల సామర్ధ్యం ఈ స్పీకర్ కలిగివుంది.

దుబాయ్ ఆడియో తయారీధారు అయినటువంటి, ZAKK సంస్థ మంచి ఫీచర్లు కలిగినటువంటి WoodStock బ్లూటూత్ స్పీకర్ ని ఇండియాలో విడుదల చేసింది. భారతీయ సంగీత ప్రియులకు నచ్చేవిధంగా మంచి మిడ్స్ మరియు డిప్స్ అందించగల సామర్ధ్యం ఈ స్పీకర్ కలిగివుంది. అధనంగా, క్రిస్టల్ క్లియర్ సౌండ్ ని అందించగల ఈ బ్లూటూత్ స్పీకర్ కేవలం రూ. 4,999 ధరతో విడుదల చెయ్యబడింది. అలాగే, Amazon, Flipkart, మరియు Paytm నుండి రూ. 4,999 ధరతో   కొనుగోలు చేయవచ్చు.

ZAKK WoodStock స్పీకర్ ప్రత్యేకతలు

ఈ ZAKK WoodStock ఎటువంటి వైర్ తో పనిలేకుండా బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది మరియు ఇందులో అందించిన 2000 mAh బ్యాటరీ వలన 8 గంటల వరకు నిరంతరాయంగా మీకు నచ్చిన సంగీతాన్ని వినిపిస్తుంది. ఇందులో అందించిన 12W x 2 (రెండు 12వాట్స్  స్పీకర్లు) మరియు ఒక సబ్ వూఫర్ సహాయంతో మీకు క్రిస్టల్ క్లియర్ సౌండ్ తో పాటుగా మంచి డీప్ బాస్ అందిస్తుంది. అలాగే, హాండ్స్ ఫ్రీ కోసం సంగీతాన్ని వినేటప్పుడు మధ్యలో వచ్చే కాల్స్ ని మాట్లాడడం కోసం ఏర్పాటుగా ఇందులో ఒక మైక్ కూడా ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఇబ్బడి లేకుండా మాట్లడుకోవచ్చు.

ఈ బ్లూటూత్ స్పీకరును చాల ప్రీమియంగా డిజైన్ చేశారు. దీనికోసం ప్రత్యేకమైన లెదర్ మరియు గట్టి చెక్కని వాడి చాలా స్టైలిష్ గా ఉండేలా మరియు గట్టిగా ఉండేలా తయారు చేశారు. అధనంగా, ఈ స్పీకర్ పైభాగంలో అందించిన టాక్టికల్ బటన్ల తో చాల సులభంగా కంట్రోల చేయవచ్చు. ఇది BT  V4.0 వర్షన్ తో   పనిచేస్తుంది మరియు 10 మీటర్ల దూరం వరకు కనెక్టివిటీ రేంజ్ అందిస్తుంది.                              

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :