New TWS Buds Launched: కొత్త బడ్స్ లాంఛ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!
Unix ఈరోజు ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది
Unix UX-W200 పేరుతో తీసుకు వచ్చిన ఈ బడ్స్ ను ట్రెండీ ఫీచర్లతో అందించింది
భారతీయ బ్రాండ్ కావడంతో బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని రేటును సెట్ చేసింది
New TWS Buds Launched: ప్రముఖ ఇండియన్ మొబైల్ యాక్ససరీస్ తయారీదారు Unix ఈరోజు ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. Unix UX-W200 పేరుతో తీసుకు వచ్చిన ఈ బడ్స్ ను ట్రెండీ ఫీచర్లతో అందించింది. భారతీయ బ్రాండ్ కావడంతో బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని రేటును సెట్ చేసింది. ఈరోజే ఇండియన్ మార్కెట్ లో విడుదలైన ఈ కొత్త ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
SurveyNew TWS Buds Launched
మొబైల్ యాక్ససరీస్ ను విరివిగా అందిస్తున్న బ్రాండ్ గా యూనిక్స్ ఇప్పటికే అందరికి సుపరిచితమే. ఈ బ్రాండ్ ఇప్పుడు కొత్త ఇయర్ బడ్స్ Unix UX-W200 ను మార్కెట్ లో విడుదల చేసింది. ఈ బడ్స్ ను కేవలం రూ. 999 రూపాయల ధరలో ప్రకటించింది. ఈ బడ్స్ ఈరోజు నుండి కంపెనీ అధికారిక వెబ్సైట్ unixindia.in నుండి అందుబాటులో వుంది.
Also Read: Amazon Offer: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్.!
Unix UX-W200 Features
యూనిక్స్ UX-W200 TWS వైర్లెస్ ఇయర్ బడ్స్ మల్టి ఫంక్షన్ టచ్ కంట్రోల్స్ తో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ 250mAh కేస్ బ్యాటరీతో టోటల్ 40 గంటల ప్లేటైమ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బడ్స్ లో Inbuilt Mic వుంది మరియు మంచి కాలింగ్ సౌకర్యాని అందిస్తుందని కూడా కంపెనీ తెలిపింది. ఈ కేస్ ను 100% ఛార్జ్ చెయ్యడానికి 70 మినిట్స్ పడుతుందని కూడా యూనిక్స్ తెలిపింది.

ఈ యూనిక్స్ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఛార్జ్ ఇండికేషన్ కోసం LED లైట్ మరియు Type-C ఛార్జింగ్ పోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ Black, White, Purple మరియు Pink తో మొత్తం నాలుగు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఇది Bluetooth Version V5.3 తో మంచి కనెక్టివిటీ మరియు ఫాస్ట్ పెయిరింగ్ ను ఆఫర్ చేస్తుందని తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile