Neckband: కేవలం రూ. 599 ధరకే పవర్ ఫుల్ మెడ్ ఇన్ ఇండియా నెక్ బ్యాండ్ లాంచ్.!

HIGHLIGHTS

Unix India నుండి కొత్త నెక్ బ్యాండ్ ఇండియాలో లాంచ్ చేయబడింది

ఈ నెక్ బ్యాండ్ పవర్ ఫుల్ సౌండ్ వంటి వివరాలతో వచ్చింది

ఈ సరికొత్త నెక్ బ్యాండ్ ను Bombshell TWS Neckband పేరుతో అందించింది

Neckband: కేవలం రూ. 599 ధరకే పవర్ ఫుల్ మెడ్ ఇన్ ఇండియా నెక్ బ్యాండ్ లాంచ్.!

Neckband: ప్రముఖ భారతీయ బ్రాండ్ Unix India నుండి కొత్త నెక్ బ్యాండ్ ఇండియాలో లాంచ్ చేయబడింది. ఈ నెక్ బ్యాండ్ ను క్విక్ ఛార్జ్, అధిక ప్లే టైమ్ మరియు పవర్ ఫుల్ సౌండ్ వంటి వివరాలతో కంప్లీట్ ప్యాకేజ్ గా అందించినట్లు కంపెనీ తెలిపింది. ఇండియన్ బ్రాండ్ సరికొత్తగా అందించిన ఈ కొత్త నెక్ బ్యాండ్ ఎలా ఉందో ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Neckband: ధర

యూనిక్స్ యొక్క ఈ సరికొత్త నెక్ బ్యాండ్ ను Bombshell TWS Neckband పేరుతో అందించింది. ఈ కొత్త నెక్ బ్యాండ్ ను కేవలం రూ. 599 ధరతో అందించింది. ఈ నెక్ బ్యాండ్ అమెజాన్ మరియు ను కంపెనీ అధికారిక వెబ్సైట్ unixindia.in నుంచి సేల్ అవుతోంది.

Unix Bombshell TWS Neckband : ఫీచర్లు

యునిక్స్ యొక్క ఈ కొత్త నెక్ బ్యాండ్ డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది మరియు 42 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. ఈ కొత్త నెక్ బ్యాండ్ క్విక్ ఛార్జ్ మరియు ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ లతో చాలా త్వరగా ఛార్జ్ అవుతుందని కూడా యునిక్స్ చెబుతోంది. ఈ నెక్ బ్యాండ్ సౌండ్ ఐసోలేషన్ నోయిస్ కంట్రోల్ తో వస్తుంది. ఈ యునిక్స్ కొత్త నెక్ బ్యాండ్ బ్లాక్, బ్లూ, గ్రీన్ మరియు రెడ్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

Unix India launches new Neckband

ఈ నెక్ బ్యాండ్ అడ్వాన్డ్స్ స్పీకర్స్ తో క్రిస్టల్ క్లియర్ ఆడియో మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందిస్తుందని కూడా యునిక్స్ తెలిపింది. ఇది చెమట ప్రూఫ్, కంఫర్టబుల్ ఫిట్, డ్యూయల్ నెక్ బ్యాండ్ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.2 సపోర్ట్ వస్తుంది మరియు టైప్ C పోర్ట్ తో వస్తుంది. ఈ నెక్ బ్యాండ్ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి ఒక గంట సమయం తీసుకుంటుంది.

Also Read: Sony Bravia 9 Series స్మార్ట్ టీవీలను భారీ ఫీచర్స్ తో విడుదల చేసిన సోనీ.!

ఈ యునిక్స్ నెక్ బ్యాండ్ హోల్డ్ చేయడానికి వీలుగా వెనుక మ్యాగ్నెట్ లను కలిగి ఉంటుంది. అంతేకాదు, చాలా తేలికగా ఉంటుందని కూడా యునిక్స్ పేర్కొంది. ఈ కొత్త బడ్స్ ను అమెజాన్ నుంచి నేరుగా కొనాలనుకుంటే Buy From Here పైన నొక్కండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo