బడ్జెట్ Dolby Soundbar డీల్స్ కోసం చూస్తుంటే ఒక లుక్కేయండి.!

HIGHLIGHTS

Dolby Soundbar కొనాలని సెర్చ్ చేస్తుంటే ఈ న్యూస్ మీ కోసమే

ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్

5 వేల బడ్జెట్ లో బెస్ట్ సౌండ్ బార్ డీల్స్

బడ్జెట్ Dolby Soundbar డీల్స్ కోసం చూస్తుంటే ఒక లుక్కేయండి.!

బడ్జెట్ ధరలో మీ స్మార్ట్ టీవీ కోసం Dolby Soundbar కొనాలని సెర్చ్ చేస్తుంటే, ఈ న్యూస్ మీకోసమే. ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ డాల్బీ సౌండ్ బార్ డీల్స్ వివరాలు ప్రత్యేకంగా అందిస్తున్నాము. మీ బడ్జెట్ 5 వేల రూపాయలు అయ్యిండి, మంచి సౌండ్ అందించే సౌండ్ బార్ కోసం చూస్తుంటే, ఈ సౌండ్ బార్ డీల్స్ ని మీరు పరిశీలించవచ్చు. ఈ డీల్స్ మీకు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ ఇండియా నుంచి అందుబాటులో ఉన్నాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Dolby Soundbar డీల్స్

ఈరోజు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ నుంచి రెండు బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఇందులో Egate Enigma 315D మరియు Blaupunkt SBW Munich 50 రెండు సౌండ్ బార్స్ కూడా ఈ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ ఆఫర్ ధర మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

Dolby Soundbar deals

Egate Enigma 315D Dolby Soundbar

ఈ సౌండ్ అబ్రా ఆఫర్ ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో రూ. 5,499 అఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ని ఫ్లిప్ కార్ట్ SBI డెబిట్ కార్డ్ తో కొనే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 300W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ DSP చిప్ తో వస్తుంది మరియు ప్రత్యేకమైన 3 EQ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ AUX, USB, ఆప్టికల్, HDMI Arc మరియు బ్లూ టూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందిస్తుంది మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది.

Also Read: WhatsApp Passkey: యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ అప్‌డేట్ అందించిన వాట్సాప్.!

Blaupunkt SBW Munich 50

బ్లౌపంక్ట్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ లేటెస్ట్ సౌండ్ బార్ డీల్ ఈరోజు అమెజాన్ నుంచి లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం రూ. 5,990 రూపాయల ఆఫర్ ధరలో ఆమెజాన్ ఇండియా నుండి సేల్ అవుతుంది. అంతేకాదు ఈ సౌండ్ బార్ ని అమెజాన్ నుంచి Canara, J&K మరియు PNB బ్యాంక్ క్రెడిట్ కార్డు తో తీసుకునే యూజర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5400 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ సౌండ్ బార్ 2.1 CH డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది మరియు టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూ టూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo