ప్రముఖ టెలివిజన్ సంస్థగా పరిచయమున్న TCL సంస్థ, ఇండియాలో ఒకేసారి 9 ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ ను ఇన్-ఇయర్, నేక్ బ్యాండ్ మరియు ఓవర్ ది ఇయర్ అన్ని సెగ్మెంట్ లలో లాంచ్ చేసింది. ఈ ఇయర్ ఫోన్స్, మంచి సొగసైన రూపం, బెస్ట్ ఇన్ క్లాస్ సౌండ్ టెక్నాలజీ మరియు సరైన ధర మిశ్రమంగా ఉంటాయని TCL తెలిపింది.
Survey
✅ Thank you for completing the survey!
TCL వైర్డ్ ఇయర్ ఫోన్స్
TCL లాంచ్ చేసిన ఈ ఇయర్ ఫోన్స్ లో 4 వైర్డ్ ఇయర్ ఫోన్స్, 3 నేక్ బ్యాండ్ మరియు 2 ఆన్ ఇయర్ సెట్స్ వున్నాయి. వైర్డ్ ఇయర్ ఫోన్స్ SOCL100, SOCL200, SOCL300, ACTV100 మోడల్ నంబర్ లతో ఉంటాయి. వీటి ధర రూ.399 నుండి ప్రారంభం అవుతుంది. ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ సెట్ లో ACTV100 మోడల్ ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్ పవర్ ఫుల్ బాస్, IPX4 రేటెడ్ తో వస్తుంది. ఇది చెమట మరియు వర్షపు తుంపర్ల నుండి సేఫ్ గా వుంటుంది.
ఇక 3 నేక్ బ్యాండ్స్ విషయానికి వస్తే, వీటిని SOCL200BT , ACTV100BT, ELIT200NC మోడల్ నంబర్ కలిగి ఉంటాయి. ఈ నేక్ బ్యాండ్ ఇన్ ఇయర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ధర రూ.1,299 నుండి ప్రారంభం అవుతుంది. ఇవి బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, తక్కువ ఛార్జింగ్ తో ఎక్కువ సమయం పనిచెయ్యడం ఫీచర్లతో వస్తాయి.
TCL ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్
TCL ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ TCL MTR200 మరియు ELIT400NC మోడల్ నంబర్ కలిగి ఉంటాయి. ఈ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ ధర రూ.1,099 నుండి ప్రారంభం అవుతుంది. వీటిలో, ELIT400NC మోడల్ బ్లూటూత్ హెడ్ ఫోన్. ఇది బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, Hi-Res ఆడియో, 22 గంటల లాంగ్ టైం ప్లే బ్యాక్ వంటి వంటి మంచి ఫీచర్లతో వస్తుంది. ఈ బ్లూటూత్ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్ ధర రూ. 6,999 రూపాయలు.