అప్ కమింగ్ Sony Dolby Atmos పవర్ ఫుల్ సౌండ్ బార్ లాంచ్ అనౌన్స్ చేసింది.!
Sony Dolby Atmos పవర్ ఫుల్ సౌండ్ బార్ లాంచ్ గురించి సోనీ కొత్త అప్డేట్ అనౌన్స్ చేసింది
వర్ ఫుల్ సబ్ ఉఫర్ తో లాంచ్ చేయబోతున్నట్లు సోనీ ఆటపట్టిస్తోంది
Dolby Atmos మరియు DTS: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిం
అప్ కమింగ్ Sony Dolby Atmos పవర్ ఫుల్ సౌండ్ బార్ లాంచ్ గురించి సోనీ కొత్త అప్డేట్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ను గొప్ప ఫీచర్స్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ తో లాంచ్ చేయబోతున్నట్లు సోనీ ఆటపట్టిస్తోంది. ఈ అప్ కమింగ్ సౌండ్ బార్ ఏమిటో, ఆ సౌండ్ బార్ ఫీచర్స్ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Sony Dolby Atmos Soundbar
ఇండియన్ మార్కెట్లో కొత్త సౌండ్ బార్ లాంచ్ చేయబోతున్నట్లు సోనీ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ టీజింగ్ ను అమెజాన్ ఇండియా ద్వారా అందించింది. ఈ అప్ కమింగ్ సోనీ సౌండ్ బార్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ సౌండ్ బార్ కీలక ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు.
Sony Dolby Atmos Soundbar : ఫీచర్స్
సోనీ అందించిన టీజర్ వివరాల ప్రకారం ఈ అప్ కమింగ్ సౌండ్ బార్ ను Dolby Atmos మరియు DTS: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో లాంచ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ సౌండ్ బార్ Dolby Vision సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంటే, HDMI ఇన్ మరియు HDMI అవుట్ తో ఇది గొప్ప విజువల్స్ కూడా పాస్ అవుట్ చేస్తుంది. ఈ ఫీచర్ తో పూర్తి స్థాయి సినిమా అనుభూతిని హోమ్ ఆడియోతో అందుకునే ఉండవచ్చు. ఇదే విషయాన్ని తెలిపేలా ఈ సౌండ్ కోసం అందించిన టీజర్ ఇమేజ్ లో సినిమా థియేటర్ ని హింట్ గా చూపించింది.
ఈ సౌండ్ బార్ టీజర్ ఇమేజ్ లో ఈ సౌండ్ బార్ పెద్ద బార్ కలిగి ఉన్నట్లు చూపించింది. అంతేకాదు, ఇందులో ‘Thrilling BASS’ అని టీజింగ్ చేసింది. అంటే, ఈ సబ్ ఉఫర్ జబర్దస్త్ బాస్ సౌండ్ అందించే విధంగా ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు సోనీ అందించిన సౌండ్ బార్ లో ఎన్నడూ చూడని విధంగా ఈ సబ్ ఉఫర్ కనిపిస్తోంది.
Also Read: BSNL Q-5G: తెలుగు రాష్ట్రానికి దక్కిన గౌరవం.. ఫస్ట్ BSNL 5G సిటీగా హైదరాబాద్.!
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ ను చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తునట్టు టీజర్ ఇమేజ్ ద్వారా క్లియర్ చేసింది. ఇందులో సైడ్ సరౌండ్ స్పీకర్లు ఉండే అవకాశం ఉండవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇమేజ్ లో రియర్ శాటిలైట్ స్పీకర్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ స్పీకర్లు సౌండ్ బార్ తో అందిస్తోందో లేక సపరేట్ గా తీసుకోవాలో అన్న విషయం అస్పష్టంగా ఉంది.