BSNL Q-5G: తెలుగు రాష్ట్రానికి దక్కిన గౌరవం.. ఫస్ట్ BSNL 5G సిటీగా హైదరాబాద్.!

HIGHLIGHTS

తెలుగు రాష్ట్రానికి ఇప్పుడు మరొక గౌరవం దక్కింది

ఫస్ట్ BSNL 5G సిటీగా హైదరాబాద్ కి ఇప్పుడు గొప్ప గౌరవం దక్కింది

ఇది గిగా బిట్ ఐడియల్ కనెక్షన్ అని బిఎస్ఎన్ఎల్ తెలిపింది

BSNL Q-5G: తెలుగు రాష్ట్రానికి దక్కిన గౌరవం.. ఫస్ట్ BSNL 5G సిటీగా హైదరాబాద్.!

BSNL Q-5G: తెలుగు రాష్ట్రానికి ఇప్పుడు మరొక గౌరవం దక్కింది. ఫస్ట్ BSNL 5G సిటీగా హైదరాబాద్ కి ఇప్పుడు గొప్ప గౌరవం దక్కింది. ఎప్పుడెప్పుడు బిఎస్ఎన్ఎల్ 5G సేవలు లాంచ్ చేస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు బిఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ అందించింది. నిన్న బిఎస్ఎన్ఎల్ 5జి సర్వీస్ పేరును సూచించిన విషయం తెలిసిందే, అయితే ఈరోజు ఈ సర్వీస్ సాఫ్ట్ లాంచ్ ను హైదరాబాద్ నగరంలో లాంచ్ చేసింది.

BSNL Q-5G:

BSN Q-5G BSNL 5G

బిఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ A. Robert J. Ravi ఈరోజు బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5జి FWA (ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్) సర్వీస్ సాఫ్ట్ లాంచ్ చేశారు. ఈ చర్యతో బిఎస్ఎన్ఎల్ 5జి సర్వీస్ అందుకున్న మొదటి సిటీగా హైదరాబాద్ చరిత్రకెక్కింది. అంతేకాదు, ఎంపిక చేసిన నగరాల్లో ఈ బిఎస్ఎన్ఎల్ 5జి సర్వీస్ లు త్వరలోనే లైవ్ అవుతాయని కూడా ఈ సర్వీస్ లాంచ్ కార్యక్రమంలో వెల్లడించారు.

BSNL Q-5G: ఏమిటి ఈ సిరీస్

ఇది బిఎస్ఎన్ఎల్ డెవలప్ చేసి అందించిన 5జి సర్వీస్. చాలా కాలంగా తన అప్ కమింగ్ సర్వీస్ కోసం పేరు ప్రకటించని బిఎస్ఎన్ఎల్, నిన్న ఈ సర్వీస్ కు ఈ పేరును నామకరణం చేసింది. అదే, బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్-5జి.

బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్-5జి : ఎలా పని చేస్తుంది?

ఈ సర్వీస్ ఎలా పని చేస్తుంది: ముందుగా, బిఎస్ఎన్ఎల్ ఒక ప్రధాన ప్రాంతాల్లో 5G టవర్ ట్రాన్స్మిషన్ సెట్ చేస్తుంది. ఈ టవర్ హై ఫ్రీక్వెన్సీ (sub-6 GHz) 5జి సిగ్నల్స్ విడుదల చేస్తుంది. ఈ సిగ్నల్స్ ని అందిపుచ్చుకునే ఇండోర్ 5G మోడెమ్ ఈ సిగ్నల్స్ అందుకునే దీన్ని Wi-Fi సిగ్నల్స్ గా యూజర్ కి అందిస్తుంది.

సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న Wi-Fi మాదిరిగానే ఉంటుంది. అయితే, సాంప్రదాయ WiFi సర్వీస్ కోసం ఉపయోగించే కేబుల్స్ లేదా ఆప్టిక్ ఫైబర్ అవసరం లేకుండా ఇది నేరుగా టవర్ నుంచే సిగ్నల్ అందుకుంటుంది. అంతేకాదు, దీనికోసం ఎటువంటి SIM తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే, కస్టమర్ ప్రెమిసెస్ ఎక్విప్మెంట్ (CPE) రౌటర్ మాత్రం తీసుకోవాలి.

ఇది గిగా బిట్ ఐడియల్ కనెక్షన్ అని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. అంటే, ఇది 1Gbps వరకు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ అందిస్తుందని అర్థం.

Also Read: Samsung Galaxy M36 5G ఇండియా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసిన శామ్సంగ్.!

బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్-5జి : సర్వీస్ ప్రస్తుతం ఎక్కడ వుంది?

బిఎస్ఎన్ఎల్ క్వాంటమ్-5జి సర్వీస్ ఈరోజు సాఫ్ట్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ నగరంలో జరిగింది. రిపోర్ట్ ప్రకారం, ఈ సర్వీస్ అమీర్ పేట లాంటి ప్రధాన ప్రాంతాల్లో ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo