Samsung Dolby Atmos soundbar got huge discount offer on flipkart sale
ప్రీమియం Samsung Dolby Atmos సౌండ్ బార్ నమ్మశక్యం కాని ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ చూడగానే కళ్ళు చెదిరే ప్రీమియం డిజైన్ మొదలుకొని ప్యూర్ డాల్బీ సౌండ్ వరకు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించిన బిగ్ డీల్స్ తో ఈ సౌండ్ బార్ ఈరోజు ఆల్ మోస్ట్ సగం ధరలో లభిస్తోంది.
శాంసంగ్ లేటెస్ట్ QS700F మోడల్ 3.1.2 ఛానల్ సౌండ్ బార్ ఈరోజు ఈ ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 46,900 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ అయ్యింది. ఈ సౌండ్ బార్ అఫీషియల్ సైట్ నుంచి ఈరోజు కూడా రూ. 40,990 ప్రైస్ ట్యాగ్ తో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఈ ప్రీమియం సౌండ్ బార్ ని 30% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 32,990 రూపాయల ఆఫర్ ధరలో లిస్ట్ అయ్యింది.
ఇంతటితో ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ లిస్ట్ అయిపోలేదు. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఏకంగా రూ. 5,750 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ సౌండ్ బార్ ని ICICI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి అందిస్తుంది. అలాగే, Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన కూడా రూ. 5,250 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 27,240 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఇది జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ గా నిలుస్తుంది.
Also Read: Xiaomi QLED Smart Tv పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్ సేల్.!
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వచ్చే ప్రీమియం సౌండ్ బార్ మరియు చాలా ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో ముందు మూడు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇది 345W జబర్దస్త్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ టాప్ సౌండ్, క్రోమ్ క్యాస్ట్ మరియు Spotify కనెక్ట్ సపోర్ట్ తో వస్తుంది.
ఇక సౌండ్ టెక్ విషయానికి వస్తే, ఇది డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ట్రూ HD, ATMOS, Dolby 5.1ch మరియు ATMOS Music వంటి ప్రీమియం ఆడియో డీకోడ్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, DTS Virtual:X, అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDR 10+ వీడియో పాస్ త్రూ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది బ్లూటూత్ 5.3, Wi-Fi, HDMI in, HDMI Out మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.