కేవలం రూ. 1,299 రేటుకే AI ENC సపోర్ట్ తో Realme Buds T01 బడ్స్ లాంచ్.!
కొత్త ఇయర్ బడ్స్ ను రియల్ మీ ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ రోజు రియల్ మీ నిర్వహించిన లాంచ్ ఈవెంట్ నుంచి Realme 13 Seris స్మార్ట్ ఫోన్స్ తో పాటు realme Buds T01 బడ్స్ ను కూడా విడుదల చేసింది. ఈ బడ్స్ ను కేవలం రూ. 1,299 రేటుకే AI ENC సపోర్ట్ తో అందించింది.
SurveyRealme Buds T01 : ప్రైస్ మరియు సేల్
రియల్ మీ బడ్స్ టి 01 ఇయర్ బడ్స్ ను రూ. 1299 ధరతో ఈరోజు విడుదల చేసింది. ఈ బడ్స్ ను బ్లాక్ మరియు వైట్ రెండు కలర్ ఆప్షన్ లలో అందించింది. ఈ బడ్స్ ను ఈరోజు నుంచే సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ బడ్స్ ను realm.com మరియు Flipkart నుంచి సేల్ చేస్తుంది.
Realme Buds T01 : ఫీచర్స్
రియల్ మీ బడ్స్ టి 01 ఇయర్ బడ్స్ ను బడ్జెట్ ధరలో రియల్ మీ లింక్ యాప్ కంపాటిబిలిటీ తో లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా ఈ బడ్స్ ను యూజర్ కు నచ్చినట్లుగా ట్యూన్ చేసుకునే వీలుంటుంది. బడ్స్ టి 01 ఇయర్ బడ్స్ ఓవరాల్ గా 28 గంటల ప్లేబ్యాక్ అందిస్తుంది. ఇందులో, బడ్స్ 6 గంటల ప్లే బ్యాక్ తో మరియు బడ్స్ + కేస్ తో 28 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది.

ఈ రియల్ మీ కొత్త బడ్స్ లో 13mm స్పీకర్లు ఉన్నాయి. ఇవి సరికొత్త PET డైఫాగ్రామ్ తో రిచ్ మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందిస్తాయని రియల్ మీ తెలిపింది. ఈ బడ్స్ లో స్మార్ట్ టచ్ కంట్రోల్ వుంది మరియు IPX4 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.
Also Read: 47th RIL AGM నుంచి Jio AI Cloud వెల్ కమ్ ఆఫర్ అనౌన్స్ చేసిన ముఖేష్ అంబానీ.!
ఇక ఈ బడ్స్ లో రియల్ మీ అందించితిన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ 88ms సూపర్ లెటెన్సీ, గూగుల్ ఫాస్ట్ పెయిర్ మరియు లీనమయ్యే కాలింగ్ కోసం AI ENC సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile