Realme Buds Air8 Pro
Realme Buds Air 8 Pro : భారత మార్కెట్లో కొత్తగా రియల్‌మీ తన కొత్త రియల్‌మీ బడ్స్ ఎయిర్ 8 ప్రో ను విడుదల చేసింది. ఆకట్టుకునే ధరలో ప్రీమియం ఆడియో అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ ఇయర్ బడ్స్ ను అందించింది. ఈ కొత్త బడ్స్ అధునాతన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో లాంచ్ అయ్యింది. ముఖ్యంగా, సంగీత ప్రియులు, గేమింగ్ అభిమానులు మరియు కాలింగ్ ఎక్కువగా చేసే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ డివైస్ ను రూపొందించినట్లు రియల్‌మీ తెలిపింది.
రియల్‌మీ ఈ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 6,999 ధరలో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ పై రూ. 300 రూపాయల తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఇయర్ బడ్స్ జూన్ 3వ తేదీ నుంచి సేల్ అవుతాయి. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఈ కొత్త ఇయర్ బడ్స్ 11mm డైనమిక్ స్పీకర్ తో పాటు 6mm మైక్రో ప్లానర్ ట్వీటర్ కలిగిన డ్యూయల్ DAC ఆడియో సిస్టమ్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో డీప్ బాస్ తో పాటు స్పష్టమైన వోకల్స్ మరియు బ్యాలెన్స్‌డ్ సౌండ్ క్వాలిటీ మీకు లభిస్తుంది. ఇందులో LHDC 5.0 హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అదనంగా, 55dB వరకు పనిచేసే అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ చుట్టూ ఉండే శబ్దాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
కాలింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ప్రతి ఇయర్ బడ్ లో మూడు మైక్రోఫోన్లు కలిపి మొత్తం ఆరు మైక్రోఫోన్ సెటప్ అందించారు. AI ఆధారిత కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు బోన్ కండక్షన్ VPU టెక్నాలజీ వల్ల కాల్స్ సమయంలో వాయిస్ మరింత స్పష్టంగా వినిపిస్తుంది. గేమర్ల కోసం ప్రత్యేకంగా 45ms లో లేటెన్సీ గేమింగ్ మోడ్ ను కూడా ఈ బడ్స్ లో అందించారు. అలాగే Bluetooth 6.1, మల్టీ డివైస్ కనెక్టివిటీ మరియు గూగుల్ ఫాస్ట్ పెయిర్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఈ బడ్స్ లో ఉన్నాయి.
Also Read: అమెజాన్ డిస్కౌంట్ తో LG Dolby సౌండ్ బార్ ని బడ్జెట్ ధరలో అందుకోండి.!
బ్యాటరీ పరంగా, ANC ఆఫ్ చేసినప్పుడు ఈ బడ్స్ గరిష్టంగా 50 గంటల వరకు బ్యాటరీ బ్యాక ప్ అందిస్తుంది. అంతేకాదు, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో సుమారు 11 గంటల ప్లే బ్యాక్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది.