Realme Buds Air 6: Hi-Res ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తో కొత్త బడ్జెట్ బడ్స్ లాంచ్.!

Realme Buds Air 6: Hi-Res ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ తో కొత్త బడ్జెట్ బడ్స్ లాంచ్.!
HIGHLIGHTS

ఈరోజు ఇండియాలో కొత్త బడ్స్ ను విడుదల చేసింది రియల్ మీ

ఈ బడ్స్ ను Hi-Res సర్టిఫికేషన్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసి ఆకట్టుకుంది

Realme Buds Air బడ్స్ 6 LHDC సపోర్ట్ తో కూడా వస్తుంది

Realme Buds Air 6: ఈరోజు ఇండియాలో కొత్త బడ్స్ ను విడుదల చేసింది రియల్ మీ. ఈ బడ్స్ ను Hi-Res సర్టిఫికేషన్ తో బడ్జెట్ ధరలో లాంచ్ చేసి ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ బడ్స్ LHDC సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ తో పాటుగా రియల్ మీ బడ్స్ వైర్లెస్ నియో నెక్ బ్యాండ్ ను కూడా విడుదల చేసింది.

Realme Buds Air 6: ప్రైస్

రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ఇయర్ బడ్స్ ను రూ. 3,299 రూపాయల ధర ట్యాగ్ తో ప్రకటించింది. అయితే, ఈ బడ్స్ పైన లాంచ్ ఆఫర్లు కూడా అందించింది. ఈ బడ్స్ పైన రూ. 300 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ బడ్స్ ను ఫ్లేమ్ సిల్వర్ మరియు ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్ లలో విడుదల చేసింది.

ఈ రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 నియో మే 27వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.

Realme Buds Air 6: ఫీచర్లు

రియల్ మీ బడ్స్ ఎయిర్ 6 ట్రూ వైర్లెస్ బడ్స్ అందమైన డిజైన్ మరియు కలర్ ఆప్షన్ లతో అందించబడ్డాయి. ఈ బడ్స్ లో 12.4mm Deep BASS స్పీకర్లు ఉన్నాయి. ఈ బడ్స్ Hi-Res ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ మరియు LHDC 5.0 హై డెఫినేషన్ ఆడియో డీకోడింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ బడ్స్ 50db ANC (యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్) సపోర్ట్ తో వస్తుంది మరియు డైనమిక్ BASS బూస్ట్ ఫీచర్ కూడా వుంది.

Realme Buds Air 6 Features
Realme Buds Air 6 Features

ఈ బడ్స్ లో 6-Mic కాల్ నోయిస్ క్యాన్సిలేషన్ తో మంచి కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కూడా రియల్ మీ తెలిపింది. ఈ బడ్స్ టోటల్ 40 గంటల ప్లేబ్యాక్ అందిస్తాయని తెలిపింది. అయితే, ANC On లో ఉన్నపుడు 26 గంటల ప్లే బ్యాక్ మాత్రమే అందిస్తుందని తెలిపింది.

Also Read: Xiaomi Smart TV: బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ విడుదల చేసిన షియోమీ.!

ఈ బడ్స్ 55ms సూపర్ లో లెటెన్సీ తో మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. రియల్ మీ Link APP తో ఈ బడ్స్ తో కావాల్సిన విధంగా సౌండ్ ను సెట్ చేసుకోవచ్చని కూడా తెలిపింది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo