POCO Buds X1: ఈరోజు నుంచి మొదలైన బడ్జెట్ Hybrid ANC ఇయర్ బడ్స్ సేల్.!
బడ్జెట్ Hybrid ANC ఇయర్ బడ్స్ POCO Buds X1 సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది
ఈ బడ్స్ ఇప్పుడు Flipkart నుండి లభిస్తున్నాయి
పోకో ఈ కొత్త ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,699 ధరలో విడుదల చేసింది
POCO Buds X1: పోకో గత వారాంతం ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసిన బడ్జెట్ Hybrid ANC ఇయర్ బడ్స్ సేల్ ఈరోజు నుంచి ప్రారంభం అయ్యింది. Poco M6 Plus స్మార్ట్ ఫోన్ తో పాటు విడుదల చేసిన ఈ బడ్స్ ఇప్పుడు Flipkart నుండి లభిస్తున్నాయి. ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
SurveyPOCO Buds X1 : ధర
పోకో ఈ కొత్త ట్రూవైర్లెస్ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,699 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను పసుపు మరియు తెలుపు కలర్ కాంబినేషన్ తో సింగిల్ కలర్ లో మాత్రమే అందించింది. ఈ బడ్స్ ను ఇప్పుడు మీరు Flipkart నుంచి కొనుగోలు చేయవచ్చు. రూ. 2,000 బడ్జెట్ ధరలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ANC ఇయర్ బడ్స్ కి గట్టి పోటీగా పోకో ఈ ఇయర్ బడ్స్ ను తీసుకు వచ్చినట్లు కనిపిస్తోంది.
POCO Buds X1 : ఫీచర్స్
పోకో ఈ కొత్త ఇయర్ బడ్స్ ను తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ Hybrid 40dB ANC సపోర్ట్ తో అందించింది. ఈ ఫీచర్ తో ఎటువంటి రణగొణ ధ్వనులు లేకుండా లీనమయ్యే సౌండ్ మరియు కాలింగ్ సౌలభ్యం కూడా అందిస్తుంది. అంతేకాదు, ఇందులో అందించిన AI ENC + క్వాడ్ మైక్ సెటప్ తో అంతరాయం లేని సౌకర్యవంతమైన కాలింగ్ ను పొందవచ్చు అని కూడా పోకో తెలిపింది.

ఈ కొత్త ఇయర్ బడ్స్ ను టైటానియం డయాఫ్రమ్ సపోర్ట్ కలిగిన 12.4mm స్పీకర్ లతో అందించింది. అందుకే ఈ బడ్స్ పవర్ ఫుల్ BASS మరియు క్లియర్ వాయిస్ తో పాటు క్రిస్పీ సౌండ్ అందిస్తుందని పోకో తెలిపింది.
Also Read: Flipkart Sale నుంచి 15 వేల లోపు లభిస్తున్న పెద్ద 40 ఇంచ్ FHD Smart Tv ఆఫర్లు.!
ఇక ఈ బడ్స్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ బ్లూటూత్ వెర్షన్ 5.3 తో మంచి కనెక్టివిటీ అందిస్తుంది. అయితే, ఈ బడ్స్ లో డ్యూయల్ కనెక్టివిటీ ఫీచర్ లేకపోవడం ఒక లోతుగా చెప్పవచ్చు. పోకో బడ్స్ ఎక్స్ 1 ఇయర్ బడ్స్ 36 గంటల ప్లే టైమ్ అందిస్తుంది మరియు SBC, AAC కోడెక్ సపోర్ట్ లతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
