Noise TWS earbuds: హైపర్ షింక్ టెక్నాలజీతో కొత్త ట్రూబడ్స్ లాంచ్

HIGHLIGHTS

నోయిస్ తన సరికొత్త TWS earbuds ను విడుదల చేసింది

Noise Buds VS303 ఇండియన్ మార్కెట్లో లాంచ్

యూనిక్ డిజైన్ తో వచ్చిన కొత్త బడ్స్

Noise TWS earbuds: హైపర్ షింక్ టెక్నాలజీతో కొత్త ట్రూబడ్స్ లాంచ్

ఈరోజు ఇండియాలో నోయిస్ తన సరికొత్త TWS earbuds ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ ట్రూబడ్స్ ను Buds VS303 పేరుతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది మరియు దీని ధర రూ.1,799 రూపాయలు గా నిర్ణయించింది. ఈ కొత్త ట్రూబడ్స్ ను సన్నగా మరియు యూనిక్ గా డిజైన్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్ బడ్స్ ను అమెజాన్ మరియు నోయిస్ అధికారిక వెబ్సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Noise Buds VS303: ప్రత్యేకతలు

ఇక ఈ Noise Buds VS303 ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ మంచి హెవీ బాస్ మరియు క్లియర్ సౌండ్ అందించగల 13mm డ్రైవ్స్ ను కలిగి ఉంటాయి. మంచి సౌండ్ మరియు వాయిస్ క్లారిటీ అందించడానికి ఈ బడ్స్ VS303 ఇన్-హౌస్ Hyper Sync టెక్నాలజీ ఉపయోగించబడింది. అంతేకాదు, కేవలం 1.5 గంటల్లోనే పూర్తిగా చార్జ్ చేయవచ్చు మరియు టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. అదనంగా, ఇది ఫుల్ టచ్ కంట్రోల్ తో వస్తుంది.  

కనెక్టివిటీ కోసం ఇందులో అందించిన బ్లూటూత్ 5.0 తో మీ స్మార్ట్ ఫోన్ కు అంతరాయం లేని కనెక్టివిటీ అందుతుంది. ఈ బడ్స్ IOS మరియు Android రెండింటికి అనువుగా వుంటుంది`ఉంటుంది. అలాగే,  గూగుల్ అసిస్టెంట్ మరియు సిరి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్స్ ఒక్క ఛార్జ్ తో 6 గంటల యాక్టివ్ ప్లే టైం, బాక్స్ తో 24 గంటల కంప్లీట్ ప్లే టైం అందుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ బడ్స్ బ్లాక్ మరియు బ్లూ వంటి రేడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది మరియు చెవులకు మంచి కంఫర్ట్ ఫిట్ ను ఇస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo