HIGHLIGHTS
నోయిస్ కంపెనీ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది
Noise Buds Combat TWS మంచి ఫీచర్లతో వచ్చింది
ఈ బడ్స్ కోంబేట్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి
నోయిస్ కంపెనీ ఈరోజు కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. అదే Noise Buds Combat TWS ఇయర్ ఫోన్స్ మరియు ఇది మంచి ఫీచర్లతో వచ్చింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ స్టెల్త్ బ్లాక్, కోవర్ట్ వైట్ మరియు షాడో గ్రే వంటి మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. నోయిస్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ బడ్స్ కోంబేట్ ట్రూ వైర్లెస్ ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Surveyఈ కొత్త ఇయర్ బడ్స్ ను నోయిస్ కేవలం రూ.1,499 ధరతో విడుదల చేసింది. ఈ బడ్స్ GoNoise ఆన్లైన్ స్టోర్ మరియు Flipkart నుండి లభిస్తుంది.
ఈ Noise Buds Combat TWS ఇయర్ ఫోన్స్ మంచి కాలింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్ట్ కలిగిన క్వాడ్ మైక్ తో వస్తుంది. ఈ ఇయర్ ఫోన్ టచ్ కంట్రోల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ మంచి క్వాలిటీ సౌండ్ కోసం 13mm డ్రైవర్స్ ను అందించింది మరియు లో లెటెన్సీ మోడ్ తో వస్తుంది.
ఈ ఇయర్ బడ్స్ పూర్తి ఛార్జింగ్ తో 8 గంటల ప్లే టైం అందిస్తుంది మరియు ఛార్జింగ్ కేస్ తో 37 గంటల ప్లే టైం ను అందించగలదని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఇది టైప్-C ఛార్జింగ్ పోర్ట్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. ఈ బడ్స్ IPX5 రేటింగ్ తో వస్తుంది మరియు బ్లూటూత్ 5.3 తో మంచి కనెక్టివిటీ అందిస్తుంది.