మోటోరోలా ఈరోజు Moto Buds BASS కొత్త ఇయర్ బడ్స్ ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ని డాల్బీ అట్మాస్ మరియు Hi-Res LADC తో లాంచ్ చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ను అట్రాక్టివ్ న్యూ కలర్స్ లో అందించడమే కాకుండా మంచి బడ్జెట్ ధరలో కూడా లాంచ్ చేసింది. మోటోరోలా లేటెస్ట్ గా అందించిన ఈ కొత్త ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Moto Buds BASS : ప్రైస్
మోటోరోలా ఈ కొత్త బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ ని కేవలం రూ. 1,999 రూపాయల ధరతో అందించింది. ఈ బడ్స్ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ పాంటోన్ పోషి గ్రీన్, పాంటోన్ డార్క్ షాడో మరియు పాంటోన్ బ్లూ జ్యూవెల్ వంటి మూడు సరికొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ లేటెస్ట్ బడ్స్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
మోటో బడ్స్ బాస్ ఇయర్ బడ్స్ ను కంఫర్ట్ ఫిట్ డిజైన్ తో అందించింది. ఈ ఇయర్ బడ్స్ ను 12.4 mm డైనమిక్ డ్రైవర్స్ (స్పీకర్) తో అందించింది. ఈ బడ్స్ Dolby Atmos తో గొప్ప సరౌండ్ మరియు Hi-Res LADC ఫీచర్ తో గొప్ప క్లారిటీ కలిగిన హై రెజల్యూషన్ సౌండ్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ బడ్స్ 50dB డైనమిక్ యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ అధిక బాస్ సౌండ్ కోసం ప్రత్యేకంగా అందించబడిన బడ్స్ మరియు మోటో బడ్స్ తో పోలిస్తే అధిక బాస్ అందిస్తుందని మోటోరోలా చెబుతోంది.
ఈ మోటోరోలా ఇయర్ బడ్స్ 6 మిక్స్ కలిగి మంచి కాలింగ్ కూడా అందిస్తుంది. ఇది కాకుండా మంచి కాలింగ్ కోసం ఇందులో Crystal Talk AI మరియు ENC ఫీచర్ అందించింది. ఇది చాలా క్లియర్ మరియు స్టన్నింగ్ క్వాలిటీ కాలింగ్ అందించడానికి సహాయం చేస్తుంది. ఈ మోటో కొత్త బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 43 గంటల ప్లే టైమ్ అందిస్తుంది. అంతేకాదు, 10 నిముషాల ఛార్జ్ తో 2 గంటల ప్లే టైమ్ అందించే క్విక్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ బడ్స్ moto buds app సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.