ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ తో boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్స్ అతి చవక ధరలో లభిస్తున్నాయి.!

Highlights

ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ తో boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్స్ అతి చవక ధరలో లభిస్తున్నాయి

బోట్ అందించిన కొత్త బార్స్ ఈ ప్రైస్ లో లభిస్తున్నాయి

ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ప్రత్యేకంగా మీకోసం అందించాము

ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ తో boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్స్ అతి చవక ధరలో లభిస్తున్నాయి. గొప్ప డిజైన్ మరియు గొప్ప సౌండ్ అని ఫీచర్స్ అండ్ సౌండ్ టెక్నాలజీతో ప్రముఖ ఇండియన్ ఆడియో బ్రాండ్ బోట్ అందించిన కొత్త బార్స్ ఈ ప్రైస్ లో లభిస్తున్నాయి. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ప్రత్యేకంగా మీకోసం అందించాము.

boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్

ఇటీవల 7.1.4 డాల్బీ అట్మోస్ టెక్ సెటప్ తో బోట్ రెండు సౌండ్ బార్స్ రిలీజ్ చేసింది. ఇందులో ఒకటి Aavante Prime X సౌండ్ బార్ కాగా Aavante Prime రెండోది. ఈ రెండు సౌండ్ బార్స్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు సౌండ్ బార్ డీల్స్ అండ్ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

Aavante Prime X

ఈ సౌండ్ బార్ ని 40 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో బోట్ ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే ఈరోజు ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం రూ. 23,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పైన రూ. 1,250 రూపాయల SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ రూ. 22,749 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.

ఈ సౌండ్ బార్ ముందు 5 ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, ఫ్రంట్ అండ్ అప్ ఫైరింగ్ స్పీకర్ కలిగిన అటాచబుల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ కలిగిన 7.1.4 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్ మరియు కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో మంచి క్లీన్ సెటప్ అండ్ స్టన్నింగ్ సౌండ్ అందిస్తుంది. ఇది HDMI Arc, బ్లూటూత్ మరియు ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Aavante Prime

ఈ సౌండ్ బార్ కూడా 7.1.4 సెటప్ తో వస్తుంది mariyu 700W అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ఫ్రంట్, అప్ ఫైరింగ్ తో పాటు సైడ్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన ప్రీమియం బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ డౌన్ ఫైరింగ్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ కూడా HMDI Arc, బ్లూటూత్, USB మరియు ఆప్టికల్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ. 25,999 రూపాయల డిస్కౌంట్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ పైన రూ. 1,750 రూపాయల SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ తగ్గింపు కూడా అందించింది. ఈ ఆఫర్ తో రూ. 24,249 రూపాయల ఆఫర్ ధరలో ఈ సౌండ్ బార్ లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile