Price Cut: ఫ్లిప్ కార్ట్ తగ్గింపు తో లేటెస్ట్ 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తోంది. రీసెంట్ గా ఫ్లిప్ కార్ట్ నిర్వహించిన SASA LELE సేల్ తర్వాత ఈ సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందించే స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ తన ప్రీమియం లుక్స్ తో చూడగానే ఆకట్టుకుంటుంది.
GOVO జస్ట్ నెల రోజుల క్రితం రూ. 23,999 రూపాయల లాంచ్ ధరతో విడుదల చేసిన Go surround 1000 Pro సౌండ్ బార్ పై రూ. 6,000 భారీ ప్రైస్ కట్ అందించింది. అందుకే, ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ కేవలం రూ. 17,999 ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై రూ. 800 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా జత చేసింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 17,199 రూపాయల డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది.
Also Read: బెస్ట్ బడ్జెట్ ప్రైస్ లో 65 ఇంచ్ 4K Smart Tv ఆఫర్ కోసం చూస్తున్నారా.. ఒక లుక్కేయండి.!
ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు సెటప్ తో లాంచ్ అయ్యింది. ఇందులో ముందు వైపు మూడు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో పాటు డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ కూడా వస్తాయి. ఈ టోటల్ సెటప్ ఎటువంటి వైర్ బెడద లేని వైర్లెస్ సెటప్ తో ఉంటుంది. ఇది టోటల్ 750W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ ఆఫర్ చేస్తుంది.
ఈ గోవో సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు మంచి ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో USB, AUX, ఆప్టికల్, HDMI Arc మరియు బ్లూటూత్ సహా మల్టి కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.6 స్టార్ తో ఈ సౌండ్ బార్ టాప్ రేటెడ్ సౌండ్ బార్ గా నిలిచింది. అంతేకాదు, సౌండ్ పరంగా ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి రివ్యూలు కూడా అందుకుంది.