JBL Live Beam 3: టచ్ స్క్రీన్ కలిగిన స్మార్ట్ కేస్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన జేబీఎల్.!

HIGHLIGHTS

జేబీఎల్ నుంచి కొత్త బడ్స్ JBL Live Beam 3 లాంచ్ అయ్యాయి

ఈ కొత్త బడ్స్ టచ్ స్క్రీన్ కంట్రోల్ తో అందించింది

ఈ బడ్స్ Hi-Res వైర్లెస్ మరియు LDAC సపోర్ట్ తో కూడా వస్తుంది

JBL Live Beam 3: టచ్ స్క్రీన్ కలిగిన స్మార్ట్ కేస్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన జేబీఎల్.!

JBL Live Beam 3: ఆడియో ప్రొడక్ట్స్ రంగంలో ప్రపంచ దిగ్గజం జేబీఎల్ నుంచి కొత్త బడ్స్ లాంచ్ అయ్యాయి. జేబీఎల్ ప్రీమియం బడ్స్ సిరీస్ లైవ్ బీమ్ నుండి నెక్స్ట్ జనరేషన్ బడ్స్ జేబీఎల్ లైవ్ బీమ్ 3 ని ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త బడ్స్ ను ఆకర్షణీయమైన మరియు సౌకర్యవంతమైన టచ్ స్క్రీన్ కంట్రోల్ మరియు మరిన్ని ఫీచర్ లతో అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

JBL Live Beam 3: ప్రత్యేకతలు

జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ ను టచ్ డిస్ప్లే కలిగిన స్మార్ట్ కేస్ తో లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ తో వచ్చే స్మార్ట్ కేస్ లో 1.45 ఇంచ్ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ సాయంతో ఎటువంటి యాప్ అవసరం లేకుండా నేరుగా కంట్రోల్ చేసే అవకాశం అందించింది. బ్యాటరీ నోటిఫికేషన్, కనెక్టింగ్ మరియు కంట్రోల్ బటన్స్ ఇందులో ఉంటాయి.

JBL Live Beam 3
JBL Live Beam 3

ఈ కొత్త జేబీఎల్ లైవ్ బీమ్ 3 ఇయర్ బడ్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో 10mm డైనమిక్ స్పీకర్లు ఉన్నాయి. ఈ స్పీకర్లు జేబీఎల్ సిగ్నేచర్ సౌండ్ తో వస్తాయి మరియు గొప్ప బాస్ తో పాటు క్రిస్పీ సౌండ్ ను మరియు జేబీఎల్ స్పెటియల్ సౌండ్ తో వర్చువల్ సరౌండ్ సౌండ్ ను అందిస్తాయి. ఈ ఇయర్ బడ్స్ అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ లీనమయ్యే సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ బడ్స్ Hi-Res వైర్లెస్ మరియు LDAC సపోర్ట్ తో కూడా వస్తుంది.

Also Read: 20 వేల కంటే తక్కువ ధరలో వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో Infinix Note 40 5G లాంచ్.!

ఈ జేబీఎల్ ఇయర్ బడ్స్ 48 గంటల ప్లే బ్యాక్ అందించగల బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది మరియు బడ్స్ తో 12 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. ఈ బడ్స్ 6 మైక్స్ తో గొప్ప కాలింగ్ ఫెసిలిటీ కూడా అందిస్తుందని జేబీఎల్ తెలిపింది. ఈ బడ్స్ లో ఉన్న వాయిస్ ఈక్వలైజర్ మరియు వాయిస్ లెవల్ ఆప్టిమైజర్ ఫీచర్లతో ఎదుటి వారికి మీరు కోరుకునే చక్కని వాయిస్ కాలింగ్ ని సమకూరుస్తుంది. ఈ బడ్స్ IP55 రెటింగ్ తో వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ గా ఉంటుంది.

JBL Live Beam 3: ధర

జేబీఎల్ లైవ్ బీమ్ 3 బడ్స్ ను రూ. 14,999 రూపాయల ధరతో ఇండియాలో విడుదల చేసింది. ఈ బడ్స్ ను Amazon మరియు in.jbl.com కంపెనీ సైట్ నుంచి సేల్ కి అందుబాటులో ఉంచింది. ఈ బడ్స్ పైన Axis మరియు DBS బ్యాంక్ కార్డ్స్ పైన 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile