Honor కేవలం రూ.399 ధరలో మంచి సౌండ్ అందించగల ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది.

HIGHLIGHTS

శక్తివంతమైన BASS, స్పష్టమైన & ప్రతిధ్వనించే మధ్యస్థ సౌండ్స్ ని అంధిస్తుంది

Honor కేవలం రూ.399 ధరలో మంచి సౌండ్ అందించగల ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది.

సరసమైన ధరలో గొప్ప స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న హువావే ఉప బ్రాండ్ అయినటువంటి హానర్ కేవలం రూ.399 రుపాయల ధరలో మంచి క్వాలిటీ సౌండ్ అందించగల ఇయర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది. ఇది చూడడానికి ఆపిల్ ఇయర్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తుంది. ఇక ఈ ఇయర్ పూర్తి వివరాల్లోకి వెళితే, దీన్ని Honor AM115 అనే పేరుతో ఈరోజు ఇండియాలో విడుదల చేసింది మరియు అమేజాన్ ఇండియా ద్వారా ఇవి అమ్మకానికి వచ్చాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ Honor AM115 ఇయర్ ఫోన్స్ వైర్ తో వస్తుంది. ఈ ఇయర్ ఫోన్స్ మంచి కంఫర్ట్, గొప్ప సమర్ధత మరియు అనుకూలతతో తీసుకొచ్చినట్లు, హానర్ పేర్కొంది. అలాగే, ఈ ఇయర్ ఫోన్స్ చూడడానికి చాలా ప్రీమియం గా కనిపిస్తాయి మరియు మంచి సౌండును కూడా అందిస్తాయని కూడా కంపెనీ చెబుతోంది. దీనిలో లోతైన మరియు శక్తివంతమైన BASS, స్పష్టమైన & ప్రతిధ్వనించే మధ్యస్థ సౌండ్స్ ని అంధిస్తుంది.

ఇక సేఫ్టీ మరియు మన్నిక విషయానికి వస్తే, హానర్ ఈ ఇయర్ ఫోన్స్ ను ఒక యాంటీ – ఆక్సిడేషన్ కోటింగ్ తో అందించింది. తద్వారా, ఈ ఇయర్ ఫోన్స్ ఎక్కువ కాలం మన్నికను అందిస్తాయని కంపెనీ వివరించింది. ఇక కాల్ మరియు మ్యూజిక్ కంట్రోల్స్ వోహాస్యానికి వస్తే, ఇందులో కాల్ ఆన్సర్/రిజక్ట్, వాల్యూమ్ పెంచడం/తగ్గించడం కోసం ఒక డేడికేటేడ్ బటన్ తొ వస్తుంది. దీనితో మీరు మీ వాల్యూమ్, కాల్ మరియు మ్యూజిక్ వంటివాటిని కాంట్రా చెయ్యవచ్చు.                                               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo