Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ సేల్ బిగ్ డిస్కౌంట్ అందుకోండి.!
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ బిగ్ డిస్కౌంట్ అందించింది
ఈ సౌండ్ బార్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది
ఈ సౌండ్ బార్ పై టోటల్ రూ. 4,700 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ అందించింది
ఇండియన్ మార్కెట్ లో లేటెస్ట్ గా విడుదలైన Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ పై ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. పండుగ సేల్ నుంచి మంచి సౌండ్ బార్ కొనడానికి చూస్తుంటే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
SurveyZebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : డీల్
జెబ్రోనిక్స్ ఈ సౌండ్ బార్ ను 2025 సెప్టెంబర్ 3వ తేదీన రూ. 32,999 రూపాయల ప్రైస్ తో మార్కెట్లో విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 డిస్కౌంట్ ధరతో లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై అమెజాన్ అందించిన డీల్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 25,299 ధరకే లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఆఫర్స్ ఏమిటి?

ఈ సౌండ్ బార్ పై SBI బ్యాంక్ అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ సౌండ్ బార్ పై రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్ మరియు రూ. 500 అదనపు డిస్కౌంట్ వంటి నాలుగు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ మొత్తం డిస్కౌంట్ విలువ రూ. 4,700 రూపాయలు ఉంటుంది. SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను కేవలం రూ . 25,299 ధరలో అందుకోవచ్చు. ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: బిగ్ డిస్కౌంట్ తో 21 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Philips QLED Smart Tv
Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 7.1.2 సెటప్ తో వస్తుంది. అయితే, ఇందులో రియర్ శాటిలైట్ స్పీకర్లు వంటివి ఉండవు. కానీ, ఈ సౌండ్ బార్ తో వచ్చే బార్ అన్ని కంప్లీట్ సరౌండ్ అందించే స్పీకర్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు మూడు స్పీకర్లు, పైన నాలుగు అప్ ఫైరింగ్ సరౌండ్ స్పీకర్లు మరియు సైడ్ లో రెండు సరౌండ్ స్పీకర్లు ఉంటాయి. దీనితో పాటు ఇంటిని సైతం షేక్ చేసే పవర్ ఫుల్ 12 ఇంచ్ ఉఫర్ కలిగిన వైర్లెస్ సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 900W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

ఇక సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో జెబ్రోనిక్స్ యొక్క ప్రత్యేకమైన అకౌష్టి మాక్స్ మల్టీ డైమెన్షనల్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ HDMI eARC, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.