బిగ్ డిస్కౌంట్ తో 21 వేలకే లభిస్తున్న 50 ఇంచ్ Philips QLED Smart Tv
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండో రోజుకు చేరుకుంది
ఈరోజు కూడా గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ అందించింది
50 ఇంచ్ Philips QLED Smart Tv ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రెండో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు కూడా గొప్ప డీల్స్ మరియు ఆఫర్స్ అందించింది. ముఖ్యంగా, ఈ రోజు స్మార్ట్ టీవీలు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇటీవల విడుదలైన లేటెస్ట్ స్మార్ట్ టీవీలు కూడా ప్రస్తుతం చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. వాటిలో ఒక బెస్ట్ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాను. అదేమిటంటే, లేటెస్ట్ గా విడుదలైన 50 ఇంచ్ Philips QLED Smart Tv ఈరోజు అమెజాన్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 21 వేల బడ్జెట్లోనే లభిస్తుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకోండి.
Survey50 ఇంచ్ Philips QLED Smart Tv : ఆఫర్
ఇండియన్ మార్కెట్లో ఫిలిప్స్ రీసెంట్ గా విడుదల చేసిన 50 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (50PQT8100/94) ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 35% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,499 ధరకే లిస్ట్ అయ్యింది. అంతేకాదు, ఈ టీవీని SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 21,999 ధరకు లభిస్తుంది. ఆఫర్ ధరకే ఈ టీవీ కొనడానికి Buy From Here పై నొక్కండి.
Also Read: Snapdragon 8 Elite తో వచ్చిన Realme GT 7 Pro భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది.!
Philips QLED Smart Tv : ఫీచర్స్
ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఇది 4K (3840×2160) రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR10+ మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ A55 క్వాడ్ కోర్ చిప్ సెట్, 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫిలిప్స్ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Google TV OS పై నడుస్తుంది మరియు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, AV ఇన్, ఆప్టికల్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.